వైద్యుల సలహాలు సూచనలు ప్రిస్క్రిప్షన్ ద్వారానే మందులను వాడాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451, 9848289499
వైద్యుల సలహా మేరకే మందులను, టాబ్లెట్లను వాడాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.*
*ఎలాంటి ఆస్వస్థత కైన వైద్యుల వద్ద చికిత్స ఉత్తమం
*మూఢనమ్మకాలను, నాటు వైద్యాన్ని నమ్మ వద్దని సూచన
*మారుమూల గ్రామాల ఆదివాసీల కై మెగా మెడికల్ క్యాంపు ఏర్పాట్లు
*బోథ్ మండలం పట్నాపూర్ గ్రామం నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
*పాల్గొన్న 250 మంది మారుమూల ఆదివాసీ గిరిజనులు
*జనరల్ మెడిసిన్, యూరాలజీ, గైనకాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిషన్, ఆర్థోపెడిక్ లలో నిష్ణాతులైన వైద్య బృందం చే చికిత్స
*యువతకు, ప్రజలకు గంజాయి మరియు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నియమాలపై అవగాహన
బోత్,(ఆరోగ్యజ్యోతి): మారుమూల ఆదివాసి గ్రామాలలో ఉంటున్న ప్రజలకు వైద్య సేవలను అందించాలని సద్దుదేశంతో జిల్లా పోలీసు యంత్రాంగం తరపున బోథ్ మండలం పట్నాపూర్ గ్రామం నందు ఈరోజు జిల్లా వైద్యశాఖ మరియు నిర్మల్ స్వప్న సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రారంభించడం జరిగింది. మొదటగా జిల్లా ఎస్పీకి గ్రామ ప్రజలు డప్పు వాయిద్యాలు నడుము స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ, వైద్య బృందం తో రిబ్బన్ కట్ చేసే ప్రారంభించారు. ముఖ్యంగా ఈ వైద్య శిబిరం నందు జనరల్ మెడిసిన్, యూరాలజీ, గైనకాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిషన్, ఆర్థోపెడిక్ లలో నిష్ణాతులైన వైద్య బృందం చే చికిత్స నిర్మల్ స్వప్న మల్టీస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో వైద్య చికిత్సలను అందజేయడం జరిగింది.ఈ వైద్య శిబిరం నందు బోథ్ మండలం పట్నాపూర్, ఇన్కర్పల్లి, సుర్దాపూర్ మేడిగుడ్ గ్రామ ల నుండి దాదాపు 250 మంది ఆదివాసి ప్రజలు వైద్య శిబిరం నందు పాల్గొని వైద్య చికిత్సలను పొందడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీలు వైద్యులను సంప్రదించిన తర్వాతనే మందులను, టాబ్లెట్లను, గోలీలను వాడాలని సూచించారు. అనవసరంగా జ్వరం టాబ్లెట్లు, నొప్పి టాబ్లెట్లను వాడటం వల్ల కిడ్నీ సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు సంభవిస్తాయని తెలిపారు. ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ప్రజలందరూ వైద్య చికిత్సలను పొంది ఉచితంగా మందులను మాత్రమే వాడాలన్నారు. అనవసరంగా చిన్న సమస్యలకే మందులను వాడి లేని సమస్యలను కొనితెచ్చుకోకూడదు అన్నారు. అదేవిధంగా గ్రామాలలో ఎలాంటి వైద్య సహకారం వచ్చిన ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాలని బాబాలను, మూఢనమ్మకాలను, చెట్ల మందులను వాడడం శ్రేయస్కరం కాదని సూచించారు. అదేవిధంగా ఆదివాసీలు గంజాయి కి దూరంగా ఉండాలని, గంజాయిని పండించడం వాడటం వ్యాపారం చేయడం వల్ల సమాజం నష్టపోతుందని అదేవిధంగా దానికి బానిస ఆయన కుటుంబాలు రోడ్డున పడతాయని తెలియజేశారు. ముఖ్యంగా యువత రోడ్డు ప్రమాదాలు జరగకుండా సరైన వయస్సు వచ్చిన తర్వాతనే లైసెన్స్ తీసుకొని వాహనాలను నడపాలని మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు కారణమై ప్రాణనష్టం సంభవిస్తుందని తెలిపారు. వాహనం నడిపే సమయంలో రోడ్డు నియమాలను సక్రమంగా పాటిస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు. యువత సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలని, ప్రస్తుత సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న నూతన పద్ధతులపై ప్రజలకు యువతకు వివరించారు. సైబర్ క్రైమ్ ప్రస్తుతం ఆన్లైన్ నందు జరుగుతున్న మోసాలు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, స్టాక్ మార్కెట్ ఫ్రెండ్, సోషల్ మీడియా ఫ్రాడ్ ఇలాంటివి జరుగుతున్న సందర్భంలో అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా డయల్ 100 ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ హండ్రెడ్ సంప్రదించాలని జిల్లా పోలీసు యంత్రాంగం నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలాలకు చేరుకొని సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తుందని తెలిపారు. త్వరలోనే జిల్లా పోలీసు యంత్రాంగం తరపున జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కేటాయించిన ప్రదేశాలలో విధులను నిర్వర్తించాలని సూచించారు. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని సరైన వయస్సు వచ్చిన తర్వాత వారికి త్వరలోనే లైసెన్స్ మేళాను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అర్హత ఉన్న వారు ప్రభుత్వ విధివిధానాల ప్రకారం లైసెన్సులను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, బూత్ సీఐ ఏ వెంకటేశ్వర్ రావు, ఎస్సై ఎల్ ప్రవీణ్, అడిషనల్ డిఎం అండ్ హెచ్ ఓ రవీంద్ర ప్రసాద్, ఏ జి పి పంతం శంకర్, డాక్టర్లు శశికాంత్, స్వప్న, మల్లేష్, సచిన్ బాబు, ధ్రువన్ కుమార్, రాహుల్, దినేష్, బోథ్ పీహెచ్సీ వైద్య సిబ్బంది, బోథ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.