రోగులకు ఇబ్బంది కలగకుండా చూడండి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్, (ఆరోగ్య జ్యోతి): అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మావలలో ఉన్న ఆయుష్ మందిర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మంగళవారం నాడు పరిశీలించారు. ఆయుష్ మందిర్ ద్వారా అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయుష్ మందిర్లో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎలాంటి మందులు ఇస్తున్నారు తదిత విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయుష్ మంది అనేది పేదలకు వైద్య సేవలో వైద్యం గురించి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. పలు రకాల అధికారులను పరిశీలించారు రోగులు ఏ విధంగా వస్తున్నారు వారికి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉండాలని తెలిపారు.