Sports & Games

Breaking News

రిమ్స్ కళాశాలలో ఘనంగా ప్రపంచ నర్సుల దినోత్సవం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451,9848 289499 

రిమ్స్ లో ఘనంగా నర్సింగ్ దినోత్సవం 
- పలువురు సీనియర్లకు అవార్డులు 
- రోగులకు సేవలు అందించడంలో నర్సులు ముందు
- ఆటపాటల సందడి 
- ఆలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు 
- కరోనా కష్టకాలంలో దేవతలుగా మారిన నర్సులు
- నర్సల సేవలు మరువలేనివి - జిల్లా కలెక్టర్

అదిలాబాద్, (ఆరోగ్య జ్యోతి); ప్రపంచ నర్సింగ్ దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ నర్సుల దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని ఆడిటోరియంలో రిమ్స్ మరియు బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రపంచ నర్సుల దినోత్సవ కార్యక్రమం లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ రాజర్షి షా  మాట్లాడుతూ రోగులకు వైద్య సేవలు అందించడంలో నర్సుల పాత్ర ఎంతో కీలకమైంది అని తెలిపారు. వైద్యులు మందులు రాసి ఇస్తారని కానీ రోగికి ఆ మందులు సమయం పాలన పాటిస్తూ ఇవ్వడం తో రోగికి అనారోగ్య భారీ నుండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత నర్సుల పై ఉందని తెలిపారు. కరోనా కష్టకాలంలో సైతం ప్రాణాలకు తెగించి నర్సులు కరోనా బారిన పడిన రోగులను కాపాడడంలో కీలకపాత్ర పోషించారని కలెక్టర్ తెలిపారు.నర్సుల సేవలు మరువలేనివని   రోగులు  వారి వృత్తి పట్ల వారి అంకితభావం , నిబద్ధతతో అందించే సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. రిమ్స్ ఆస్పత్రిలో నర్సులు అందిస్తున్న సేవలను కలెక్టర్ గుర్తించారు. ప్రతి రోజు రిమ్స్ ఆస్పత్రిలో ప్రసవాలు  ఎన్నో  జరుగుతున్నాయని వీటి వల్ల మన రించుకు గుర్తింపు వస్తుందని తెలిపారు. అంతేకాకుండా నర్సులు  అందిస్తున్న సేవల వల్లనే రిమ్స్ ఆస్పత్రికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని తెలిపారు.అంతర్జాతీయ నర్సుల  వారోత్సవాలు మే 6న ప్రారంభమై మే 12 న ముగుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు (మే 12, 1820 - ఆగస్టు 13, 1910) తెలిపినారు.ఫ్లోరెన్స్ నైటింగేల్  క్రిమియన్ యుద్ధంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించారని వైద్య సేవలు అందించడంతో పాటు వేలాదిమంది ప్రాణాలను రక్షించిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు.  ప్రతి సంవత్సరం మే 12న ప్రపంచ నర్సింగ్ డే ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. నైటింగేల్‌ను " ది లేడీ విత్ ది లాంప్ " అని పిలిచేవారని ఆన్నారు.ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ అశోక్, నర్సింగ్ సూపరిండెంట్ రమాదేవి, బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజిత్ తదితరులు పాల్గొన్నారు.

ఆలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు: 
ప్రపంచ నర్సుల దినోత్సవ సందర్భంగా రిమ్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. చిన్నారులు రకరకాల నృత్యాలు ఆలపించారు. నర్సులు కూడా రకరకాల డ్యాన్సులతో పలువురిని ఆకర్షించే రీతిలో ప్రదర్శించారు.

హెడ్ నర్సులకు అవార్డులు:
ప్రపంచ నర్సింగ్ దినోత్సవ సందర్భంగా హెడ్ నర్సులకు రిమ్స్ ఆడిటోరియంలో అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్సులకు అవార్డులను జిల్లా  కలెక్టర్ రాజర్షి షా ..డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ అశోక్, నర్సింగ్ సూపర్డెంట్ రమాదేవి ఇలా ఆధ్వర్యంలో అవార్డులను పంపిణీ చేశారు. అవార్డులు అందుకున్న వారిలో నర్సింగ్ సూపర్డెంట్ గ్రేడ్ 2 పి రమాదేవి, ఎం హేమావతి, టీ విమలమ్మ, జీ దేవి సిహెచ్ వర కుమారి, వై సుజాత, ఏ.ఆకమ్మ,టి.స్వరూపారాణి ,ఎస్ డి రిజ్వాన, ఎస్ సత్యవతి,  సి.హెచ్ పద్మ, యు మాస్గసెట్, ఏ ప్రసన్న రాణి, జి సుభాషిని, కే. సుధామణి, డి ప్రమీల , జి కృపావతి ఏ సంధ్యారాణి , ఐ వసంత, అసుంత, వసంత, రాజ సులోచన, వి సుజాత కుమారి, బి.ప్రేమలత, కె ఎలేంద్ర, వై నాగరత్నం,దేవ కుమారి, సుశీల, వి రత్నకుమారి, శ్రీలక్ష్మి, వనజ, అరుణ, మంజుల రాణి, తదితరులు అవార్డులు అందుకున్నారు.