Sports & Games

Breaking News

సిహెచ్ సి పరకాల ఆర్ఎంఓ డాక్టర్ బాలకృష్ణ కు వినతి పత్రం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

*సి.హెచ్.సీ.పరకాల ఆర్.ఎం.ఓ.డాక్టర్. బాలకృష్ణ వినతిపత్రం ఇచ్చిన పరకాల బ్లడ్ బ్యాంక్ ఉద్యోగులు*

*హనుమకొండ,(ఆరోగ్య జ్యోతి):హనుమకొండ జిల్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరకాల ఆర్.ఎం.ఓ. డాక్టర్ బాలకృష్ణ గారికి వినతిపత్రం ఇచ్చిన బ్లడ్ బ్యాంక్ ఉద్యోగులు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ హనుమకొండ  జిల్లా సి.హెచ్.రోజా మాట్లాడుతూ...మే 20 న ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ఏఐటియూసి ఆధ్వర్యంలో ఉద్యోగుల హక్కుల సాధనకై నిర్వహించే ఇందిరా పార్క్ మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హనుమకొండ జిల్లా ఉద్యోగులందరికీ పిలుపునిచ్చారు. ఎన్. హెచ్ ఎంలో  78 క్యాడర్స్ లో పని చేస్తున్న 17541 ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్  బెనిఫిట్స్ 10 లక్షలు ప్రభుత్వం చెల్లించాలి. ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్స్ ఉద్యోగుల సమస్యల శాశ్వత పరిష్కారం కొరకై ఒక్కరోజు మహాధర్నా హైదరాబాద్ ఇందరా పార్క్ ఉద్యోగులందరూ  పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  నర్సింగ్ ఆఫీసర్ యస్.ప్రమీల, ల్యాబ్ టెక్నీషియన్ బి.సుమలత, డేటా ఎంట్రీ ఆపరేటర్ సి.హెచ్ రోజా, ల్యాబ్ టెక్నీషియన్ ఎం. ప్రశాంత్, ల్యాబ్ అటెండెంట్ కే. రమేష్ తదితరులు పాల్గొన్నారు...