20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

*ఎం.జి.ఎం హాస్పిటల్ ఆవరణలో వాల్ పోస్టర్ విడుదల చేసిన ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకులు*
*20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు పిలుపు*
వరంగల్,(ఆరోగ్య జ్యోతి): ఆల్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ఉదయం 10 గంటలకు మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎం.జీ.ఎం. హాస్పిటల్ ఆవరణలో ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్స్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ( ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో మే 20వ తేదీన జరుగు సార్వత్రిక సమ్మె సందర్భంగా వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి , ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వము కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నందున మే 20న కార్మిక సంఘాల పిలుపునిచ్చాయి. 29 కార్మిక చట్టాలను తొలగించి 4 లేబర్ కోడ్స్ గా కొత్త చట్టాలను తీసుకొచ్చి దేశంలో ఉన్న కార్మిక వర్గానికి అన్యాయం చేసి పెట్టుబడుదారులకు యాజమాన్లకు అనుకూలంగా చట్టాలను అమలు చేసే విధంగా ప్రయత్నం కొనసాగుతుందన్నారు. ఉద్యోగులకు కనీస వేతనాలు పెంచకుండా ఈ.ఎస్.ఐ, పి.ఎఫ్, ఉద్యోగ భద్రత, పని హక్కులను 8 గంటల పని విధానాన్ని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుందన్నారు తద్వారా కార్మిక వర్గం పెట్టుబడిదారుల కనుసందాల్లో బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నం అధిక ధరలు ఆకాశాన్ని అంటుతున్న ధరలను అదుపు చేయడంలో విఫలమైందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులుకు కనీస వేతనాలు పెంపుదల అమలు చేయలేదు. ఈ విధానాలకు వ్యతిరేకంగా వరంగల్ జిల్లాలో మే 20 తేదీ న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్స్ పాల్గొన వలసిందిగా కోరుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఎం.జీ.ఎం. హాస్పిటల్ ఉద్యోగులు రోహిణి సింధూజ, ఆర్.భాగ్యలక్ష్మి,ఎం.కోమల, సంధ్య, వసంతరావు, ఆశ కార్యకర్త రాణి, ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.డి యాకుబ్, సిఐటియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎండి మహబూబ్ పాషా, వరంగల్ జిల్లా నాయకులు ఏఐసిటియు ఐతం నాగేష్ మరియు తదితరులు పాల్గొన్నారు...