Sports & Games

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సకల సౌకర్యాలు - జిల్లా కలెక్టర్ రాజార్షి షా

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

- ప్రభుత్వ ఆసుపత్రిలో సకల సౌకర్యాలు 
- డెంగ్యూ టెస్ట్ రీమ్స్ లో మాత్రమే అవుతుంది 
- ప్రైవేటు ఆస్పత్రిలో డెంగ్యూ టెస్ట్ కాదు ప్రజలు మోసపోవద్దు 
- ప్లేట్లెట్ ఎక్కించుకునే అంత వ్యాధులు ఆదిలాబాద్ లో లేవు 
- ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి మోసపోవద్దు 
- జిల్లా కలెక్టర్ రాజార్షి షా
అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా ప్రజలు రోగాల బారిన పడినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు చేయించుకోవాలని ప్రైవేట్ ఆస్పత్రిలోకి వెళ్ళవలసిన అవసరం లేదని - జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు.జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా కష్టాల రామకృష్ణ కాలనీలోని పల్లెదవఖానాలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధులు దరి చేరవని కలెక్టర్ సూచించారు.దానికోసం క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి ప్రతిరోజు వెళ్లిన సందర్భంలో ఆశాలు, ఏఎన్ఎంలు ప్రతి ఇంటి వద్ద పరిసరాలను పరిశీలిస్తూన్నారని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రపరుచుకోనే విధంగాఅవగాహన కల్పించాలన్నారనీ పేర్కొన్నారు. నీటి నిల్వలను తొలగిస్తూ మూతలు పెట్టడం లాంటి అలవాట్లను ప్రతి గృహంలో అవగాహన కలిగించాలన్నారన్నారు. డెంగ్యూ వ్యాధి ఈడీస్ ఇజిప్సీ అనే దోమ కుట్టడం వలన వస్తుందని దీనిని టైగర్ దోమ అని కూడా అంటారని ఇది పగటిపూట కుడుతుందని అన్నారు. మూడు దోమల ద్వారా ఐదు రకాల వ్యాధులు వ్యాపిస్తాయన్నారు వీటిలో డెంగీ అత్యంత ప్రమాదకరమైందని డెంగీ లక్షణాలు ఉన్నట్లయితే మీ దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తగిన వైద్య పరీక్షలు చేసుకుని చికిత్స పొందాలని తెలియజేశారు. డెంగ్యూ వ్యాధిని ఎలీషా పరీక్ష ద్వారా నిర్ధారణ చేయవచ్చు అన్నారు. డెంగ్యూ వ్యాధి చికిత్స పట్ల ప్రజల్లో మూఢనమ్మకాలు ఉన్నాయని వాటిని తొలగించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాల న్నారు.ప్రతి ఇంటి వద్ద పరిసరాలను పరిశీలిస్తూ ,నీటి నిల్వలను తొలగిస్తూ, ప్లాస్టిక్ ని నివారిస్తూ, అన వసరమైన ఖాళీ డబ్బాలు ,ప్లాస్టిక్ కవర్లు ,పాత టైర్ లలో ,కొబ్బరి 
చిప్పలు, గ్లాసులు ఏవి కూడా ఇంటి వద్ద పరిసరాల్లో ఉండకుండా ప్రతి శుక్రవారం, ఆదివారాలలో తొలగించాలని నీటి నిల్వలని పారపోస్తూ, కడిగి, ఎండబెట్టి మరలా వాటిని వాడుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం మరియు ఆదివారం ఫ్రైడే డ్రైడేనీ విధిగా పాటించాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో వివిధ శాఖల సమన్వయంతో అందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రజలందరినీ దోమల నివారణలో భాగస్వామ్యం చేసేలా అవగాహన కలిగించాలన్నారు. దోమల నివారణ, కీటక జనిత వ్యాధుల నివారణ వైద్యశాఖ ఒకరే కాకుండా ప్రజలందరూ భాగస్వాములైనప్పుడే కీటక జనత వ్యాధులను డెంగీ లాంటి వ్యాధిని నివారించవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సాధన, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత,జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ మిట్టపల్లివార్, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, డాక్టర్ శ్రీనివాస్, అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్లు ఆడే సురేష్, సుభాష్, ఎన్ సి డి నుండి శ్రీనివాస్, రమణ, మలేరియా శాఖ నుండి అనిల్ తోపాటు ఆరోగ్య కార్యకర్తలు శకుంతల, శ్రీ వాణి, మమత ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.