Sports & Games

Breaking News

జిల్లాస్థాయి రాష్ట్రీయ విజ్ఞానిక ప్రదర్శన పోటీలు - పోటీల్లో ఆదిలాబాద్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు

జిల్లా స్థాయి రాష్ట్రీయ వైజ్ఞానిక ప్రదర్శన 2024 25 జిల్లా స్థాయి ఇన్స్పెక్టర్ అవార్డుల ప్రధాన కార్యక్రమం పట్టణంలోని స్థానిక కాన్వెంట్ హైస్కూల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజార్షి షా ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జు పటేల్ పాల్గొని ప్రారంభించారు. ఈ జిల్లాస్థాయి రాష్ట్రీయ వైజ్ఞానిక ప్రదర్శన పోటీల్లో ఆదిలాబాద్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. 9వ తరగతికి చెందిన కే.అక్షర, సహజ లు నేచురల్ ఫార్మింగ్ గురించి ప్రదర్శించారు. రైతు నేచురల్ గా పండించే ఆహారాన్ని మనం తీసుకున్నట్లయితే ఏ విధమైన అనారోగ్యాలు రావని తెలిపారు. నేచురల్ గా ఎలా పండించాలి రైతు నేచురల్ గా పండించేందుకు ఎన్ని కష్టాలు పడతారు అని వివరించే రీతిలో వారు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ కు చెందిన విద్యార్థిని విద్యార్థులతో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.