Sports & Games

Breaking News

ఏపీకి 8 తెలంగాణకు 7 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 984802451 

ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు.. కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం!!

దిల్లీ: దేశ వ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది.ఈ మేరకు శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో ఏడు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ నూతన కేవీల ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు 82వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందనుంది.

ఏపీలో ఏర్పాటు చేయనున్న కేవీలు ఇవే.....
అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లె, సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, రొంపిచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్‌లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు..
తెలంగాణకు కొత్తగా 7 నవోదయ విద్యాలయాలను కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని జగిత్యాల, నిజామాబాద్‌, కొత్తగూడెం, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, సూర్యాపేటలో నవోదయా విద్యాలయాలను ఏర్పాటు చేయనుంది.

2025 - 26 నుంచి ఎనిమిదేళ్ల కాలంలో కొత్త కేవీల నిర్మాణానికి, కర్ణాటకలోని శివమొగ్గలో కేవీని విస్తరించేందుకు అంచనా వ్యయం రూ.5,872.08 కోట్లుగా నిర్ణయించారు. మాస్కో, కాఠ్‌మాండూ, టెహ్రాన్‌తో పాటు దేశ వ్యాప్తంగా 1,256 కేవీలు ఉండగా.. ఈ స్కూళ్లలో 13.56లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.దిల్లీ మెట్రో నాలుగో దశ ప్రాజెక్టు కింద 26.463 కి.మీల మేర రిథాలా-కుండలి కారిడార్‌ కారిడార్‌ను అభివృద్ధికి క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దిల్లీ- హరియాణా మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు రూ.6,230 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ కారిడార్‌ను నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.