Sports & Games

Breaking News

అనుమానితుల పేర్లు నమోదు చేసుకోవాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

 డి. ఎల్.ఓ  డాక్టర్ గజానన్
 ఆదిలాబాద్:- కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో భాగంగా ఈనెల రెండవ తేదీ నుండి చేపట్టిన సర్వేలో అనుమానితులను ఎక్కువ సంఖ్యలో గుర్తించి పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ గజానన్ సూచించారు.ఆదివారం 
ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. సర్వేలో భాగంగా కుటుంబ సభ్యులందరిని తప్పనిసరిగా పరీక్షించాలని ఆశా కార్యకర్తలను ఆదేశించారు. అనుమానితులను తమ తమ పి. హెచ్ సి ల కు రిఫర్ చేయాలని సూచించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 2027 సంవత్సరం కల్లా భారతదేశాన్ని కుష్టురహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. అందులో భాగంగానే ఇంటింటా నిర్వహిస్తున్న ఈ సర్వేలో అధికంగా కుష్టు రోగులను గుర్తించేందుకు కృషి చేయాలని అన్నారు. శరీరంపై పాలిపోయిన రాగి రంగు మొద్దుబారిన మచ్చలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు ఉన్నవారు తమ ఇంటికి వచ్చే ఆశా కార్యకర్తలకుచూపించుకోవాలని  కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పారా మెడికల్ అధికారులు వామన్ రావు, రమేష్, సి. వో. లు రణిత, నవీన్, ఏఎన్ఎంలు హరిత,లత, ఆశా కార్యకర్తలు అర్చన,లక్ష్మీ,స్వరూప తదితరులు పాల్గొన్నారు.