ట్రాన్స్ జెండర్లకు చట్టాలపై అవగాహన అవసరం
- లీగల్ సెల్ న్యాయశాఖ అధికారి సౌజన్య
అదిలాబాద్: జిల్లావ్యాప్తంగా నివసిస్తున్న ట్రాన్స్ జెండర్లకు ు ప్రతి ఒక్క చట్టంపై అవగాహన కలిగి ఉండాలని లీగల్ సెల్ న్యాయశాఖ అధికారి సౌజన్య అన్నారు. ట్రాన్స్ జెండర్లకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా లీగల్ న్యాయశాఖ అధికారి సౌజన్య ముఖ్యఅతిథిగా హాజరై ట్రాన్స జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ట్రాన్స్ జెండర్ అదిలాబాద్ జిల్లా సభ్యులు పూరి, చిట్టీలు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ జెండర్లకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేవని తెలిపారు. అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నామని న్యాయశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. ఉండటానికి ఇల్లు లేదని, ఇంటి స్థలం లేదని, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేవని జిల్లా లీడర్ న్యాయశాఖ అధికారి సౌజన్య దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా నెలనెలా కొంతమందికి రేషన్ వస్తుందని, రేషన్ కార్డులు లేవని ప్రభుత్వం తరఫున పెన్షన్, ఆరోగ్య బీమా లాంటి సౌకర్యాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని పూరి మరియు చిట్టీలు తెలిపారు. వెంటనే జిల్లా లీగల్ సెల్ న్యాయశాఖ అధికారి సౌజన్య స్పందించి తమ ఆధీనంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ట్రాన్స్ జెండర్లకు తెలిపారు.రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇంటి స్థలాలు పక్కా గృహాలు అలాంటి సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. అవసరమైతే ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు న్యాయపరమైన సమస్యలు ఏదైనా ఉంటే లీగల్ సెల్ తరపున సహాయ సహకారాలు అందిస్తామని ట్రాన్స్ జెండర్లకు జిల్లా లీగల్ న్యాయశాఖ అధికారి సౌజన్య తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలు ట్రాన్స్ జెండర్ లకు అందే విధంగా ప్రభుత్వానికి లేఖలు రాస్తామని తెలిపారు. ప్రభుత్వం రిమ్స్ లో మైత్రి ట్రాన్స్ జెండర్ ప్లస్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే వెంటనే అక్కడికి వెళ్లి చికిత్సలు చేయించుకోవాలని తెలిపారు. జిల్లా లీగల్ సెల్ న్యాయశాఖ ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నివారణ శాఖ సిపిఎం నాగరాజు, సతీష్ భాగ్యలక్ష్మి భాను రేఖ పూరి,చిట్టి,రజిత,దీక్షిత, భార్గవి,రాజేశ్వరి,గోపి,సరిత, ఉమితా, రాజు తదితరులు పాల్గొన్నారు.



