కాంట్రాక్ట్ ఏ.ఎన్.ఎం లందరిని యధావిధిగా రెగ్యులర్ చేయాలి-లేకుంటే డిశంబర్ 19 నుండి నిరవధిక సమ్మె.
- అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చిన తెలంగాణ వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ
తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నరెండవ ఏఎన్ఎంలు,ఈ.సీ.ఎ ఎన్. ఎంలు,ఆర్బన్ హెల్త్ సెంటర్స్ ఏ.ఎన్.ఎంలు, వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎంలు, హెచ్.ఆర్డి ఏఎన్ఎంలు,ఆర్ సి హెచ్ ఏఎన్ఎంలు,ఇతర అన్ని రకాల ఏ.ఎన్.ఎంలను రాత పరీక్ష లేకుండ యధావిధిగా రెగ్యులర్ చేయాలని లేకుంటే 2024 డిశంబర్ 19 నుండి" నిరవధిక సమ్మె" చేస్తామని వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని యూనియన్లు అసోసియేషన్ల ఆధ్వర్యంలో గల తెలంగాణ వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ ఈరోజు రాష్ట్ర అధికారులను కలసి సమ్మె నోటీసుఇవ్వడం జరిగింది.ఈ రోజు కాంట్రాక్ట్ ఏఎన్ఎంల రాష్ట్ర సమావేశం హైదరాబాదులో జరిగింది,ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... వైద్య ఆరోగ్య శాఖలో గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి వివిధ రూపాల్లో ఆందోళన పోరాటాలు,నిరవధిక సమ్మెలు జరిగాయని ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాకపోవడం అన్యాయం అన్నారు,గతంలో సమ్మె సందర్భంగా ఏఎన్ఎంల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం తేది:02-09-2023న ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందని,ఈ కమిటీ ఏఎన్ఎంలతో చర్చించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని ఉన్న ఆ కమిటీ రిపోర్ట్ లేకుండ 2024 డిశంబర్ 29 రాత పరీక్ష తేదీని ప్రకటించడం వలన కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే ఈ రాత పరీక్షను వాయిదా వేసి,ఈ త్రిసభ్య కమిటీ ఏఎన్ఎం లతో సమావేశమై న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము,లేనియెడల 2024 డిశంబర్ 19 నుండి రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 6000 మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలో పాల్గొనాలని తీర్మానించామని ఇదే విషయాన్ని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కి,టి సాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ కి,డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కి,ఇతర అధికారులకు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.ప్రభుత్వం,సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి పోరాట మిటీతో చర్చలు జరిపి సమ్మెను నివారించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు కె.యాద నాయక్,కె.సాయి రెడ్డి,జి రాజశేఖర్,ఈ.కిరణ్ రెడ్డి,మహాల,మధురిమ, మమత,ఏ.కవిత,కిరణ్మయి ప్రియాంక,మంజుల,విజయ, సుగుణ,జ్యోతి,పద్మ, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
సమ్మె డిమాండ్లు:-
1) కాంట్రాక్ట్ ఏఎన్ఎం లకు రాత పరీక్ష లేకుండ రెగ్యులర్ చేయాలి.
2) కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజీ 50 మార్కులు ఇవ్వాలి.
3) వయోపరిమితిని ఎత్తివేయాలి.
4) సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
5) ఎక్స్ గ్రేషియా,ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి.
6) జనాభా ప్రాతిపదికన సబ్ సెంటర్ లను పెంచాలి.
