ట్రాన్స్ జెండర్ల సమస్యలను పరిష్కరించండి - ట్రాన్స్ జెండర్ పూరి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ఆదిలాబాద్ రిమ్స్, (ఆరోగ్య జ్యోతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ జెండర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజా కు ట్రాన్స్ జెండర్ పూరి తమ సమస్యలను విన్నవించారు. ఆధార్ కార్డులు కొంతమందికి లేవని అలాగే రేషన్ కార్డులు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ దృష్టికి పూరి తీసుకువెళ్లారు. ఉండటానికి ఇల్లు లేక సమస్యలు ఎదుర్కొంటున్నామన్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైత్రి ట్రాన్స్ జెండర్ క్లినిక్లను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా ను ట్రాన్స్ జెండర్ పూరి కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లు రజిత, చిట్టి, దీక్షిత, భార్గవి, రాజేశ్వరి, గోపి తదితరులు పాల్గొన్నారు.