Sports & Games

Breaking News

ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

- లీగల్ సెల్ న్యాయశాఖ అధికారి సౌజన్య 

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): హెచ్ఐవి ఎయిడ్స్ పై గ్రామ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా లీగల్ సెల్ న్యాయశాఖ అధికారి సౌజన్య అన్నారు. రిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన వరల్డ్ ఎయిడ్స్ డే వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికారిని సౌజన్య మాట్లాడుతూ ప్రజలతో సమానంగా హెచ్ఐవి సోకిన వారికి కూడా సమాన హక్కులు ఉన్నాయని తెలిపారు. హెచ్ఐవి వచ్చిందని బాధపడవలసిన అవసరం లేదని క్రమం తప్పకుండా మందులు వాడాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. చాలామంది భయాందోళనకు గురై మానసికంగా కృంగిపోతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా హెచ్ఐవి వచ్చినవారు తప్పనిసరిగా ప్రతిరోజు వైద్యుల సలహాలు సూచనల వరకు మందులు వాడినట్లయితే వారి యొక్క జీవిత కాలాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. హెచ్ఐవి సోకినవారు లీగల్ గా ఏదైనా కేసులు ఉంటే తమ కార్యాలయాన్ని సంప్రదించినట్లయితే సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు న్యాయవాదిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చాలామంది హెచ్ఐవి సోకిందని మరణమే వస్తుందని మానసికంగా కృంగిపోతారని అది చాలా పొరపాటని తెలిపారు. హెచ్ఐవి వచ్చిన వారికి తప్పనిసరిగా మందులు వాడడంతో పాటు మానసిక వైద్యుని దగ్గర అవసరమైతే కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలని తెలిపారు.అనంతరం హెచ్ఐవి సోకిన వారు క్రమం తప్పకుండా మందులో వాడుతున్న వారిని గుర్తించి బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం హెచ్ఐవి ఉన్నవారికి స్వచ్ఛంద సంస్థ తరఫునుంచి రూపా తనవంతుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ , జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ గజానంద్, డోనాల్డ్ రూప, సిపిఎంబి నాగరాజు, ఏఆర్టి డాక్టర్ పద్మిని ప్రియదర్శిని ,డాక్టర్ అభిషేక్ పాజిటివ్ వర్కర్స్ సరిత ఎన్జీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.