ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలోని ఓపి విభాగంలో ఏర్పాటు చేయనున్న మైత్రి ట్రాన్స్ జెండర్ల క్లినిక్ ను జిల్లా కలెక్టర్ రాజార్షి షా సోమవారం సాయంత్రం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మైత్రి ట్రాన్స్ జెండర్ల క్లినిక్ లాక్ లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ కు సూచించారు.రిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్న ట్రాన్స్ జెండర్ క్లినిక్ లో అన్ని రకాల వైద్య సేవలతో పాటు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా ప్రతి డాక్టర్ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.ు మైత్రి క్లినిక్ లో కౌన్సిలింగ్ సేవలు లింగ ఆధారిత సేవలు సాధారణ ఆరోగ్య సేవలు లైంగికంగా సంక్రమించే వ్యాధులకు చికిత్స సామాజిక అర్హత సేవలు తోపాటు ఇతర క్లినికల్ ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రత్యేకంగా డెర్మటాలజిస్టు లేదా సైకీయా ట్రస్ట్ సేవలు కూడా అందుబాటులో ఇంటర్నెట్ కలెక్టర్ వివరించారు. గదిలో కార్టూన్స్ ఏర్పాటు చేయాలని మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.త్వరలో మైత్రి ట్రాన్స్ జెండర్ల క్లినిక్ ను ఇంచార్జ్ మంత్రిచే ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట డిసిసి చైర్మన్ తిరుపతి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేంద్ర రాథోడ్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాల డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అశోక్, జిల్లా ఎయిడ్స్ మరియు లెప్రసీ నివారణ అధికారి డాక్టర్ గజానంద్, డాక్టర్ రాహుల్, తోపాటు ట్రాన్స్ జెండర్లు పూరి, రజిత, చిట్టి, దీక్షిత, భార్గవి, రాజేశ్వరి, గోపి తదితరులు పాల్గొన్నారు.