తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యాన్ని బలోపేతం చేశాం
- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ బ్యూరో,(ఆరోగ్యజ్యోతి):హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖలకు చెందిన మంత్రులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ తోపాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు వైద్య కళాశాలల డైరెక్టర్లు ప్రిన్సిపాల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు డి సి హెచ్ ఎస్ తోపాటు మెడికల్ పారామెడికల్ సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని తిలకించారు. ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో జిల్లా కలెక్టర్ రాజార్షి షా, డిసిసి చైర్మన్ కోట్నక్ తిరుపతి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ తోపాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు వివిధ శాఖలకు చెందిన మెడికల్, పారామెడికల్ సిబ్బంది వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఒక్క ఏడాదిలోనే వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండగా వైద్య కళాశాలలో మాత్రమే ఏర్పాటు చేసిందని అందులో సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం వల్ల విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డైరెక్టర్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ టూటర్ పోస్ట్లతోపాటు మెడికల్ పారామెడికల్ సిబ్బందిని కూడా నియమించడం జరిగిందని తెలిపారు.త్వరలో ఆసుపత్రులలో పడకల సంఖ్య పెంచామని, వైద్య శాఖలో ఎన్నడూ లేనంతగా వైద్యుల, నర్సుల నియామకాలు పూర్తి చేశామని అన్నారు. ఇటీవల వైద్య పోస్టులు కూడా భర్తీ చేశామని తెలిపారు. స్టాఫ్ నర్స్ పోస్టులతో పాటు ఫార్మసిస్టు పోస్టులను కూడా భర్తీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేనిని తెలిపినారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యాన్ని బలోపేతం చేసిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటికీ ఎన్నో ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించడం జరిగిందని ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి ఘనత అని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ 5 లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలకు పెంచిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వ అనేది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 835 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ను విడుదల చేయడం జరిగిందని ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే గొప్ప విషయం అన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు 300 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రమే రిలీజ్ చేసేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 835 కోట్ల రూపాయలను విడుదల చేశామని పేర్కొన్నారు.104, 108 సర్వీస్ లో కూడా తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనిని పేర్కొన్నారు.ఉత్సవాలలో భాగంగా.. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు సీఎం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలను, 33 మైత్రి ట్రాన్స్ జెండర్ల క్లినిక్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు.