Sports & Games

Breaking News

ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా హుస్సేన్

- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ చేతుల మీదుగా ప్రశాంస పత్రం నిజామాబాద్,(ఆరోగ్యజ్యోతి):నిజామాబాద్ జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంద్రాపూర్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న హుస్సేన్ కు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ చేతులమీదుగా ప్రశంస పత్రంతో పాటు సత్కారాన్ని అందుకున్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంద్రాపూర్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న హుస్సేన్ రోగులకు అందించిన సేవలను గుర్తించి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా ఈ అవార్డును అందించడం జరిగింది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పట్టమన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పనిచేస్తున్న ఉత్తమ ఉద్యోగులుగా కొంతమంది ఉద్యోగులకు అవార్డులను ప్రధానం చేశారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని ల్యాబ్ టెక్నీషియన్ హుస్సేన్ తెలిపారు.