Sports & Games

Breaking News

రిమ్స్ లో విజయ పాల ఉత్పత్తుల దుకాణాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

అదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): అదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆస్పత్రి ఆవరణలో విజయ పాల ఉత్పత్తుల అమ్మకపు దుకాణాన్ని జిల్లా కలెక్టర్ రాజార్షి షా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజయపాల ఉత్పత్తుల కేంద్రాలను జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రిమ్స్ తోపాటు బస్టాండ్ రైల్వే స్టేషన్ రైతు బజార్ తోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రిమ్స్ లో విజయ డైరీ అమ్మక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. రోగులకు బంధువులకు కానీ కొనుగోలు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని కలెక్టర్ పేరుకున్నారు. ప్రభుత్వం అన్ని రెసిడెన్షియల్ మరియు హాస్టల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్న అని తెలిపారు. అన్ని హాస్టల్లో రిమ్స్ లో విజయ పాలన కొనాలని ప్రభుత్వం జీవో కూడా జారీ చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్, సూపరిండెంట్ డాక్టర్ అశోక్, రిమ్స్ ఆర్ ఎమ్ ఓ డాక్టర్ సాయి నర్సింగ్ సూపర్డెంట్ రమాదేవి, హెడ్ నర్స్ భాగ్యలక్ష్మి, విజయ పాల డైరీ మేనేజర్ మధుసూదన్ రావు ,డిస్ట్రిబ్యూటర్ నరేందర్, షాప్ యజమాని స్రవంతి, అశ్విన్ కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.