నిధ్య మెడికల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏఎన్ఎంల టెస్ట్ పేపర్లు ఉచితంగా పంపిణీ
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి);నిధ్య మెడికల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏఎన్ఎంల టెస్ట్ పేపర్లు ఉచితంగా పంపిణీ చేశారు. పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో నిధ్య మెడికల్ అకాడమీ ఎం ఆర్ నగేష్, అడ్మినిస్ట్రేటివ్ నుండి రేవతి, శాలిని, మార్కెటింగ్ మేనేజర్లు గాంధీ,అఖిల్, గణేష్ రాజశేఖర్ లు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిధ్య మెడికల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలకు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, తోపాటు మెడికల్ పారామెడికల్ కోచింగ్లు ఇచ్చి ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించామని వారు తెలిపారు. ఆన్లైన్ కోచింగ్ ద్వారా మరియు రెగ్యులర్ కోచింగ్ ద్వారా తమ వద్ద శిక్షణ తీసుకొని ఉద్యోగ అర్హత పరీక్షలో రాసిన వారు ఉద్యోగం పొందిన వారు చాలా ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఏఎన్ఎం రెగ్యులర్ పోస్టుల కోసం ఆన్లైన్ లో శిక్షణ ఇవ్వడంతో పాటు రెగ్యులర్ క్లాసెస్ కూడా ప్రారంభమయ్యాయి అని వారు పేర్కొన్నారు. గతంలో స్టాఫ్ నర్స్ లో ఉద్యోగం పొందిన వారు చాలామంది తమ వద్ద శిక్షణ తీసుకున్న తర్వాత ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారని వారు పేర్కొన్నారు. ఇనిస్ట్యూట్ ఆధ్వర్యంలో ఆన్లైన్ మరియు రెగ్యులర్ క్లాసులు జరుగుతున్నాయని రెగ్యులర్ క్లాసులో ఆన్లైన్లో శిక్షణ తీసుకొని పరీక్ష రాసేందుకు సమయం ఉందని అందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపీహెచ్డబ్ల్యూ పూర్తి చేసిన అభ్యర్థులు శిక్షణ తీసుకోవాలని వారు తెలిపారు. అంతేకాకుండా తమ వద్ద శిక్షణ పొందిన వారు రాష్ట్రస్థాయి ర్యాంకులు కూడా సాధించారని తెలిపారు. సమయం తక్కువగా ఉందని ఆన్లైన్ మరియు రెగ్యులర్ క్రాస్ లు జాయిన్ అయ్యేవారు తొందరగా జైన్ కావాలని తెలిపారు. చాలా మందికి ఎంపీహెచ్డబ్ల్యూ ఏఎన్ఎం పోటీ పరీక్షలకు టెస్ట్ పేపర్ ఎలా ఉంటుందో అని తెలియని పరిస్థితి ఉందని ఏఎన్ఎం సోదరీమణులను దృష్టిలో ఉంచుకొని ఎం పి హెచ్ డబ్ల్యు ఏఎన్ఎం పోటీ పరీక్షల కోసం ప్రత్యేక గైడ్ ను తయారుచేసి ఉచితంగా అన్ని జిల్లాల్లో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మాడల్ పేపర్ లేనిది పరీక్ష ఎలా రాయాలో తెలియని పరిస్థితి కూడా ఉందని తెలిపారు ఎందుకంటే ఎంపీహెచ్డబ్ల్యూ ఏఎన్ఎం పరీక్షలు నిర్వహించి చాలాకాలం అవుతుందని చాలామంది ఎంపీహెచ్డబ్ల్యూ ఏఎన్ఎం అభ్యర్థులకు మోడల్ పేపర్ ఎలా ఉంటుందో తెలువదని దీని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా మోడల్ పేపర్ను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అందుకు శిక్షణ తీసుకుంటేనే ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. టెస్ట్ పేపర్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ చదువుకోవాలని వారు పేర్కొన్నారు.