Sports & Games

Breaking News

ఆశాల పై నిర్భందాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 ఆశాలకు పిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ బొజ్జ ఆశన్న CITU జిల్లా అధ్యక్షులు సమస్యల పరిస్కారం కోసం శాంతి యుతంగా ఛలో హైదరాబాద్ కు వెళ్లే ఆశలను ,సీఐటీయూ నాయకులను ఎక్కడి కక్కడ నిర్బందించడాన్ని నిరసిస్తూ ,ఆశాల పై జరిగిన లాఠీ చార్జీని ఖండిస్తూ ఆశాల సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ఆదిలాబాద్ బస్టాండ్ ముందర రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దాహానం చేశారు .ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ , తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశాలకు 18 వేల రూపాయల వేతనం పెంచుతామన్న హామీని అమలు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తుందని విమర్శించారు . మహిళలు అన్న కనీసం సోయి లేకుండా మగ పోలీస్ లతో కొట్టించడం అన్యాయం అన్నారు . ప్రజాపాలన అంటూ నిరసనలు తెలిపే హక్కును కాలరాస్తున్నదని మండి పడ్డారు . రేవంత్ సర్కార్ పోలీస్ లను నమ్ముకొని పరిపాలిస్తున్నది అలాంటి ప్రభుత్వాలు మనుగడ సాధించలేవు అన్న సత్యాన్ని గుర్తిస్తే మంచిదని హితవు పలికారు .వెంటనే ఆశాల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు . జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న తదితరులు పాల్గొన్నారు.