Sports & Games

Breaking News

ఆరోగ్య పాఠశాల లో ఆయుష్ తో యోగాసనాలు

వార్తలు పంపండి...ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

 - ఆరోగ్య పాఠశాలలో 22 మంది యోగం మాస్టర్ల తో యోగాసనాలు 
 - 146 పాఠశాల కళాశాలలో యోగ
 - 12 ఆయుష్ ఆరోగ్య మందిరాల సిబ్బందితో యోగ శిక్షణ
 - 133 పాఠశాలలు.. 13 కళాశాలలో యోగ
 - డిసెంబర్ 4 నుంచి జనవరి 10 వరకు కొనసాగుతున్న పాఠశాలల యోగ
 - జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే పాఠశాలల్లో యోగా శిక్షణ

 అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లాలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాల్లో ఆదిలాబాద్ జిల్లా ష్ లోని ఆయుర్వేద విభాగంలో గల ఆయుష్ ఆరోగ్య మందిరాల్లో పనిచేస్తున్న యోగ ఆధ్యాపకులచే శిక్షణను ఇస్తున్నట్లు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వాణి డిస్టిక్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ప్రీతల్ రాథోడ్ లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా ఆదేశాల మేరకు ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా ఆయుష్ విభాగంలోని ఆయుర్వేద యోగ ఆధ్యాపకులచే పాఠశాలలు మరియు కళాశాలలో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ కూడా మంచి సహాయ సహకారాలు ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి అందించడం జరిగిందని వారు తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్య పాఠశాలలో యోగి గాను అభ్యసించాలని కూడా డైరెక్టర్ తెలిపినట్టు వారు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 133 కేజీ వి బి పాఠశాలలు 13 కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు కేజీవీబీ లో ఉదయం 6:30 నుండి 7-15 నిమిషాల వరకు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో మధ్యాహ్నం 3- 45 నిమిషాల నుండి 4:30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆయుష్ ఆధ్వర్యంలో 12 ఉన్నాయని ఇందులో పని చేస్తున్న 22మంది యోగ ఆధ్యాపకులచే యోగ పై శిక్షణ పాఠశాల పిల్లలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఆదిలాబాద్ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఆరు మంది శిక్షణ ఇవ్వగా మిగతా ప్రాంతాల్లో మిగతావారు శిక్షణ ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు. యోగ శిక్షణలో భాగంగా సిట్టింగ్ ,స్ట్రాండింగ్, ప్రాణయామం, తదితర వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 

ఆరోగ్య పాఠశాలలో విద్యార్థులకు యోగ విద్య 
- ఆయుష్ డిస్టిక్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ప్రీతల్ 
జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా ఆయుష్ (ఆయుర్వేద) విద్యార్థులకు యోగ విద్యను అభ్యసిస్తున్నట్లు ఆయుష్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ప్రీతల్ తెలిపారు. యోగ విద్యను విద్యార్థులకు అభ్యసించడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు చురుకుదనం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు యోగ విద్యను ఉదయం సాయంత్రం వేళల్లో అభ్యసిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

 యోగ అభ్యాసం వల్ల పిల్లలకు కింది లాభాలు కలుగుతాయి:

 • ఆరోగ్యం: యోగ అభ్యాసం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. యోగ వ్యాయామం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు బలంగా ఉంటాయి.
 • మంచి మనస్తత్వం: యోగ అభ్యాసం వల్ల పిల్లలు మంచి మనస్తత్వంతో ఉంటారు. యోగ వ్యాయామం వల్ల పిల్లలు శాంతంగా, సుఖంగా ఉంటారు. 
• బలం: యోగ అభ్యాసం వల్ల పిల్లలు బలంగా ఉంటారు. యోగ వ్యాయామం వల్ల పిల్లలు శరీరంలోని అన్ని అవయవాలు • శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
 • మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 
• మనసు శాంతంగా మరియు స్థిరంగా ఉంటుంది. 
• నిద్ర మంచిగా వస్తుంది. 
• మెదడు పనితీరు మెరుగుపడుతుంది. 
• వ్యాయామ శక్తి మరియు సమతుల్యత పెరుగుతుంది. • స్నేహాలు మరియు సంబంధాలు బలపడతాయి.
 • ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

పిల్లల ఆరోగ్యం కోసమే యోగ 
-ఆయుర్వేద సీనియర్ వైద్యాధికారి డాక్టర్ వాణి 
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో మరియు జూనియర్ కళాశాలలో యోగ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. యోగ చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు జ్ఞాపకశక్తి పెరగడం చురుగ్గా ఉండటం లాంటి ఉంటాయని తెలిపారు. ప్రతి రోజు యోగా చేయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా అనారోగ్యం బారిన పడకుండా కూడా ఉంటారని తెలిపారు