తక్కువ ధరకే జనరిక్ ఔషధాలు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
*ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రం ప్రారంభం
*తక్కువ ధరకే నాణ్యమైన మందులు దొరుకు ఏకైక స్థలం
*ముఖ్య అతిథిలుగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందె బాబయ్య
*నాకు కావలసిన పూర్తి మెడిసిన్ ఇక్కడే కొంటా... పాలమూరి విష్ణువర్ధన్ రెడ్డి
అఖండ భారత వానికి మూడుసార్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తన భారత ప్రజల పట్ల విశ్వాసంతో వారు అంత ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇప్పటికే షాద్ నగర్ పట్టణంలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషదీ కేంద్రాలు ఉన్నప్పటికీ స్థానిక పద్మావతి కాలనీ కుంటకుంటబడి వీధిలో నూతన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రం సిలివేరి బిక్షపతి యాజమాన్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకుడు అందె బాబాయ్యలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి సదుద్దేశంతో చేసిన జన ఔషదీ కేంద్రాల ఏర్పాటు వలన నిరుపేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, నాణ్యమైన మందులు అతి తక్కువ ధరలకు ఇక్కడ దొరుకుతాయని, నేను కూడా నాకు కావలసిన మెడిసిన్ మొత్తం ఇక్కడే తీసుకుంటానని తెలిపారు. ప్రజలందరూ ఇక్కడ ఔషధాలు కొనడం వలన దేశీయ ఉత్పత్తుల కొనుగోలు పెరిగి దేశానికి ఆర్థికంగా సహకరించిన వారం అవుతామని, నాణ్యమైన మందుల వలన త్వరగా రోగ విముక్తులమవుతామని తద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకుడు అందె బాబయ్య, పట్టణ అధ్యక్షులు హరి భూషణ్ పటేల్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు కోట జనార్దన్, ప్రధాన కార్యదర్శి చిన్న బాల్ రాజ్, కార్యదర్శి బోనగిరి భాస్కర్, కుడుముల బాలరాజ్, వంశీకృష్ణ, మఠం ఋషికేష్, గజ్జల ప్రవీణ్ కుమార్, బాల్ రెడ్డి, గుబ్బ నరేన్, తదితరులు పాల్గొన్నారు.