Sports & Games

Breaking News

ఎంజీఎం లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నల్ల బ్యాడ్జీలతో నిరసన

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

వరంగల్,(ఆరోగ్య జ్యోతి):నిన్నటి రోజున బలవన్మరణం గురి అయినటువంటి భరత్ ఎస్.టీ.ఎల్.ఎస్. కు సంఘీ భావంగా భోజన విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ హెచ్ ఎం ఆల్  క్యాడర్స్ ఉద్యోగస్తులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.అందులో భాగంగా వరంగల్ ఎం.జీ.ఎం. హాస్పిటల్ ముందు నల్ల బ్యాచ్లతో నిరసన చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ అండ్  ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ మెంబర్ భరత్ ఎస్.టి.ఎల్.ఎస్.నిర్మల్ డిస్టిక్ నిన్న సూసైడ్ చేసుకున్న సందర్భంలో ఉద్యోగికి రావలసిన బెనిఫిట్స్ 10 లక్షలు ఎక్స్గ్రేషియా, పి.ఎఫ్.,  బకాయిలను ప్రభుత్వం వెంటనే అతని కుటుంబానికి చెల్లించి ఒకరికి ఉద్యోగ ఉపాధి కల్పించాలని ప్రభుత్వం తరఫున వచ్చే బెనిఫిట్స్ సాధ్యమైనంత త్వరగా కుటుంబానికి అందేటట్టు చేయాలని ఆవేదన వ్యక్తం చేసిన జాతీయ ఆరోగ్య మిషన్ కాంటాక్ట్  అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. ఇటీ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం  ఎంజీఎం  హాస్పిటల్  వరంగల్ జిల్లా  డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్  డైక్ మేనేజర్ మెరుగు అనిల్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ పవన్ కుమార్, సోషల్ వర్కర్ లావణ్య, ఆడియాలజిస్ట్ వనజ , స్టాఫ్ నర్స్ హేమ , ఎస్.ఎన్.సి.యు. డాటా ఎంట్రీ ఆపరేటర్స్ బీ. మురళి, పృద్వి, ఎన్.ఆర్.సి. కౌన్సిలర్ టీ. రోహిణి సింధుజ,  సపోర్టింగ్ స్టాప్ స్వరూప  తదితరులు పాల్గొన్నారు.. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా ప్రభుత్వం ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత సరైన జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్  రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నూర సంపత్ కుమార్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది..