Sports & Games

Breaking News

విజయవంతంగా జిల్లాలో వ్యాసక్తమీ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు

జిల్లాలో మగవారికి కుటుంబ నియంత్రణల భాగంగా అవగాహన శస్త్ర చికిత్సలు కార్యక్రమంలో జిల్లాలో ఈ పక్షోత్సవాలలో ఒక వంద ఒకటి మగవారికి కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయడం జరిగినది జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 33 బెల్లంపల్లి ఆసుపత్రిలో 38 చెన్నూరు ఆసుపత్రిలో 30 చేయడం జరిగినది ప్రజలు ముందుకు వచ్చి కుటుంబ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో సంతోషదాయకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ తెలియజేసినారు ఈ శిబిరాలలో డాక్టర్ రవీందర్ డాక్టర్ ఎమ్మెల్యే రెడ్డి డాక్టర్ రవీంద్ర ప్రసాద్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మగవారికి చేసినారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కృపాబాయి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎస్ అనిత డిప్యూటీ ఉపవైద్యాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ డాక్టర్ శ్రీధర్ ఆర్ఎంఓ వెంకటేశ్వర్లు సిహెచ్ఓ అల్లాడి శ్రీనివాస్ నాందేవ్ వసుమతి పద్మ భారతి సాదిక్ ఎస్ఓ కాంతారావు బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి పాల్గొన్నారు ఈ సంవత్సరం కుటుంబ నియంత్రణ గురించి భార్యాభర్తలు మాట్లాడుకోవడం ఈరోజు నుంచి ప్రారంభం చేయాలి మగవారి పాత్ర కుటుంబ నియంత్రణలో ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది పురుషుల్లో ఇది చాలా సులువైన ఆపరేషన్ కావున ప్రజలు అర్హులైన దంపతులు ఉపయోగించుకోవాలని కోరడం జరిగినది అదేవిధంగా కుటుంబ నియంత్రణలో భాగంగా తాత్కాలిక పద్ధతులను వాడాలని కుటుంబ సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరడమైనది ఆపరేషన్ లు చేయించుకున్న వారికి వైద్య సిబ్బంది పరీక్షలు చేయాలని రోజువారి బాగోగులు తెలుసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారు ఆదేశించినారు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు కల్పించిన డాక్టర్ హరిచంద్ర రెడ్డి బెల్లంపల్లి ఆసుపత్రిలో డాక్టర్ రవికుమార్ చెన్నూరు ఆస్పత్రిలో డాక్టర్ సత్యనారాయణ పర్యవేక్షకులకు వైద్య ఆరోగ్యశాఖ తరఫున ధన్యవాదములు తెలియజేసినారు