నిర్మల్ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్య
.ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్య
ఉద్యోగం రెగ్యులర్ కాలేదని మనోవేదన
జీవో 510తో నష్టపోయామంటూ సూసైడ్ నోట్
నిర్మల్ జిల్లాకేంద్రంలో విషాద ఘటన
నిర్మల్ : నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగి భరత్కుమార్ ఇవాళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు అతడు రాసిన సూసైడ్ నోట్లో తన మరణానికి గల కారణాలను రాశాడు. లేఖ ప్రకారం.. భరత్ 2018లో డీఎస్సీ ద్వారా నియామకం పొంది ఆరోగ్యశాఖ ఆర్ఎన్టీసీపీ విభాగంలో సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ టెక్నీషియన్గా చేరాడు. కానీ తనకన్నా హోదా తక్కువ ఉన్నవారికి జీతం ఎక్కువ రావడం, కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉండిపోవడంతో నిరాశకు గురయ్యాడు. తన ఉద్యోగాన్ని రెగ్యులర్ చేసే విషయంలో జీవో 510, అన్యాయం చేసిందని, అప్పటి ప్రభుత్వం తెచ్చిన జీవో వల్ల నష్టపోయానని లెటర్లో పేర్కొన్నాడు. ఇటీవల జీవో 16 కూడా అమలు చేయవద్దని ఉత్తర్వులు రావడంతో ఉద్యోగం రెగ్యులర్ కాదనుకుని తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 'నా ఆత్మహత్యతో అయినా మిగ తావారికి న్యాయం జరగాలి, ఈ విషయాన్ని రాష్ట్రస్థాయిలో తెలిసేలా చూడండి' అంటూ సూసైడ్ నోట్ రాసుకొచ్చాడు. భరత్కు భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. నిర్మల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.