అసెంబ్లీలో మొదటి రోజు మాట్లాడే ముందు మార్కండేయన్ని మొక్కాను..
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
-పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చు....
* పద్మశాలీల అభ్యున్నతికి పూర్తి సహకారం అందిస్తా.. !
* పోటీ పరీక్షల కోసం త్వరలోనే బీసీ స్టడీ సెంటర్ ఏర్పాటు ..
* ఉద్యోగాలు సాధించిన వారు సమాజ సేవకు పాటుపడాలి..
* సర్కారు కొలువులు సాధించిన 40 మందికి సన్మానించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ..
సర్కారు ఉద్యోగాల సాధన వెనక కఠోర శ్రమ దాగి ఉంటుందని, లక్ష్యసాధన కోసం దృఢ సంకల్పం పట్టుదలతో ముందుకు సాగాలని ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ శాంతినగర్ పద్మశాలి సంఘ భవనంలో ప్రభుత్వ కొలువులు సాధించిన 40 మంది యువతీ యువకులకు పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో (పోప) ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నుండి విద్యార్థులు పేదరికం, సామాజిక ఆటుపోట్లను ఎదుర్కొని పట్టుదలతో ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. తాను కూడా పేదరికంతో అనేక ఇబ్బందులు పడ్డానని, మూడు సార్లు ఎన్నికల్లో ఓటమి చవిచూసినా వెనుతిరిగి చూడకుండా ముందుకు వెళ్లడం వల్లే ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని అన్నారు. పద్మశాలీల తో నాకు ఎనలేని అనుబంధం ఉందని, వారి కుటుంబ ఆర్థిక సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. పద్మశాలీల సమస్యలకు ప్రజా గొంతుక గా మారి శాయశక్తుల తన వంతు కృషి చేస్తానని అన్నారు. అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెట్టినప్పుడే మార్కండేయుడి ఆశీస్సులు పొందదం జరిగిందని గుర్తు చేశారు. కొందరు ఉద్యోగులు విజయ సాధన కోసం తాము పడ్డ కష్టాలను, పోటీ పరీక్షల్లో నెగ్గడానికి ఇబ్బందులను వివరించారు. త్వరలోనే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పేద విద్యార్థుల ప్రతిభ నైపుణ్యత మెరుగుపరిచేందుకు అన్ని వసతులతో బీసీ స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్టు హామీ ఇచ్చారు. పద్మశాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన కుర్ర రమేష్, కుసుమ గణేష్ లను పదోన్నతి పొందిన ఎం జోత్స్న, చంద్రకళ, బేతలలిత, అర్చనలను ఎమ్మెల్యే , పద్మశాలి సంఘం నేతలు సన్మానించారు. పద్మశాలి సంఘం, పోపా తరఫున ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను జిల్లా అధ్యక్షులు బేత రమేష్, నాయకులు శివకుమార్, లచ్చిరాం, చంద్రమోహన్ , తాలూకా అధ్యక్షులు బొమ్మ కంటి రమేష్, ప్రధాన కార్యదర్శి చిలుక విలాస్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు కటకం రాందాస్, కాసర్ల శ్రీనివాస్, కామన్ విట్టల్, బాస దత్తు, రాకేష్ పద్మవార్ , బార్ అసోసియేషన్ అధ్యక్షులు నగేష్, మండల ప్రధాన కార్యదర్శి తుమ్మరాజు, గాజుల హనుమాన్లు, పాల్గొన్నారు.