Sports & Games

Breaking News

ఆహారం వండే విధానంలో అనేక మార్పులు రావాలి

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రతి హాస్టల్లో వంట చేసే సమయంలో అనేక రకాల మార్పులు రావాలని అప్పుడే ఆహారం విషతుల్యం కాకుండా ఉంటుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సమావేశ మందిరంలో సోమవారం రోజు హాస్టల్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ ఆహారం వండే సమయంలో అనేక రకాల కల్తీల వల్ల రకరకాల కారణాల వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి 1880లో ఫుడ్ పైసలు గమనించడం జరిగిందని తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్ వచ్చిందంటే ఆ వ్యక్తికి వికారం అతిసారా,తలనొప్పి, అలసట,కడుపు తిమ్మిరి తో పాటు అనేక లక్షణాలు కనబడతాయని తెలిపారు ఈ లక్షణాలు కనిపించడం వెంటనే వైద్యుని సంప్రదించాలని లేక దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చూయించుకోవాలని తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్ అనేక రకాల కారణాలు ఉన్నాయని ముఖ్యంగా జంతువుకు సంబంధించిన మటన్ చికెన్ గుడ్లు, పాల వల్ల రావచ్చు ఉడుకని భోజనం లేదా ఎక్కువ కాలం నిలువ ఉండే ఆహార పదార్థాల వల్ల కూడా రావచ్చు పండ్లు లేక కూరగాయలు ఉత్పత్తి సమయంలో కలిసిటయతే ఫుడ్ పాయిజనింగ్ రావచ్చు అని తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా అయితే కిడ్నీ సమస్యలు రక్తహీనత లాంటి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని ఆయన వివరించారు.మనం వండే సమయంలో అన్ని రకాల కూరగాయలు ఆకురలను శుభ్రంగా కడిగి వంట చేసినట్లయితే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ మరియు ఎన్సిడి ప్రాజెక్టు అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్ ,బాసర జోన్ ఫుడ్ సేఫ్టీ అధికారి తారా సింగ్, డి బి సి డి కె రాజలింగు తదితరులు పాల్గొన్నారు.