ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి కుటుంబానికి న్యాయం చేయాలి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ఎన్ హెచ్ ఎం నిర్మల్ జిల్లా ఎస్టిఎల్ఎస్ నిన్న ఆత్మహత్య చేసుకోవడంపై వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని రాష్ట్ర యూనియన్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో లంచ్ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది. పెద్దపెల్లి జిల్లాలో ఉన్నటువంటి పీ.హెచ్.సీ, యు.పి.హెచ్.సి. భరత్ ఆత్మకు శాంతి చేకూరాలని గత 25 సంవత్సరాల నుండి ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ రెగ్యులర్ లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కొన్ని సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాము. పోరాటానికి గత ప్రభుత్వాలు సహకరిస్తలేరు, నిరాకరిస్తున్నారు, కావున ఉద్యోగులు శ్రమదోపిడికి గురవుతున్నారు.. మా డిమాండ్లను పరిష్కరించాలి ఇకనైనా మా బతుకులు మారుతాయి అని ఆశతో ఉన్న తరుణంలో వేరే రాష్ట్రాలలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను మాత్రం పట్టించుకోకుండా మానసిక వేదనకు గురిచేస్తున్నారు, చాలీచాలని జీతాలతో ఇన్ని రోజులు కుటుంబాలను నెట్టుకొచ్చిన తరుణంలో మంచి భవిష్యత్తులో వస్తాయని ఆశించే తరుణంలో తోటి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు అనారోగ్య కారణాలు , యాక్సిడెంట్లు జరిగి ఎంతోమంది ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినారు అదే మాదిరిగా నిన్న నిర్మల్ జిల్లాలో ఇక మా బతుకులు బాగుపడమని మానసిక వేదన గురి అయ్యి తను చాలించిన ఎస్. టి. ఎల్ ఎస్. ఉద్యోగి ప్రాణాలు తీసుకోవడం జరిగింది. ఇది బాధాకరమైన విషయం ఇకనైనా ప్రభుత్వాము రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు , వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం కావున మా యొక్క కోరికను మీరైనా అర్థం చేసుకొని ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయండి , గతంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రెండు విధాలుగా విభజించడం జరిగినది 510 జీవోలో టెక్నికల్ క్యాడర్స్ చేర్చి మిగతా క్యాడర్స్ ఇంకా వారికి క్యాడర్ ఫిక్సేషన్ కాలేదు కావున వారందరినీ క్యాడర్స్ ఫిక్స్ చేసి వారి యొక్క సేవలను గుర్తించి వారి జీతాలను పెంచుతారని ఆశిస్తున్నాము. భరత్ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చి వారి యొక్క కుటుంబాన్ని 50 లక్షల పరిహారం చెల్లించాలని ఏఐటీయూసీ ఎన్ హెచ్ ఎం రాష్ట్ర కమిటీ తరఫున తమరిని కోరుచున్నాము మేము వైద్య ఆరోగ్యశాఖలో ఉంటి మాకు ఏ రోగము వచ్చినా పట్టించుకునే నాధుడే లేడు కావున మా యొక్క డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాం ...ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న పనిచేసి మరణించిన కుటుంబాలను వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి, వారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ,510 జీవోలో అన్యాయం జరిగిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరినీ క్యాడర్ ఫిక్సేషన్ చేసి వారికి తగిన న్యాయం చేయాలి ,మహిళ ఉద్యోగులకి మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలి, ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత ఇవ్వాలి,ఉద్యోగ భద్రత కల్పించాలి పైన పేర్కొన్న డిమాండ్లన్నింటిని ప్రభుత్వము గుర్తించి మాకు మా ఎన్ హెచ్ ఎం కుటుంబాలను ఆదుకోవాలని కోరుచున్నాము ఎన్ హెచ్ ఎం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మరియు ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ సురేష్ నాయక్..ఈ కార్యక్రమంలో ఎస్ ఎన్ సి యు ,టి .హబ్, ఎం.సి.హెచ్. హాస్పిటల్ స్టాఫ్, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు సరళి, మానికేశ్వర్ రెడ్డి , కమ్యూనిటీ ఆర్గనైజర్/పబ్లిక్ హెల్త్ మేనేజర్ పార్జితం , ఫార్మసిస్టు శ్రావణ్ కుమార్, స్టాఫ్ నర్స్లు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు ఎస్.టీ.ఎల్.ఎస్.లు, ఎస్.టి ఎస్. సూపర్వైజర్లు, టిబిహెచ్ వి , డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్లు , సపోర్టింగ్ స్టాప్ మరియు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు...