రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో న్యూరో శాస్త్ర చికిత్సలు
ఎడిటర్ కే నరేష్ కుమార్ 9848025451
రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో అరుదైన న్యూరో సర్జరీలు
- త్వరలో రిమ్స్ ఆస్పత్రిలో రోగి బంధువులకు పాస్ సిస్టం
- ఆస్పత్రిలోకి గుట్కా తంబాకు ఇతర మత్తు పదార్థాలు తేవద్దు
- రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్
- న్యూరో రోగుల గురించి వివరించిన డాక్టర్ విజయ మోహన్ రాజు
అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో న్యూరోకు సంబంధించిన రెండు అరుదైన శాస్త్ర చికిత్సలను న్యూరో సర్జన్ డాక్టర్ విజయ మోహన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. బుధవారం రోజు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ మాట్లాడుతూ నిరోకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు రిమ్స్ సూపర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయని డైరెక్టర్ తెలిపారు. డ్రీమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మరియు రిమ్స్ ఆస్పత్రిలో రోగుల వద్దకు బంధువులు వచ్చి పక్క రోగులకు మరియు ఇతరులకు ఇబ్బంది చేయడంతో పాటు పారిశుద్ధం ని అస్తవ్యస్తంగా చేస్తున్నారని దీన్ని దృష్టిలో ఉంచుకొని రోగి ఆసుపత్రిలో జైన్ అయినప్పుడు ఒక పాస్ ఇవ్వడం జరుగుతుందని ఆ పాస్ ఉన్నవారిని లోనికి అనుమతిస్తామని డైరెక్టర్ తెలిపారు. ఈ పాస్ సిస్టం నికి ప్రతి ఒక్కరు ప్రజలు రోగి బంధువులు రోగులు అందరి సహాయ సహకారాలు అవసరమని ఆయన తెలిపారు. అనంతరం న్యూరో సర్జన్ డాక్టర్ విజయ్ మోహన్ రాజు మాట్లాడుతూ న్యూరో కు సంబంధించిన శాస్త్ర చికిత్సలు ఓపి కూడా రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. సాధ్యమైనంతవరకు రోగులకు సంబంధించిన అన్ని చికిత్సలు శాస్త్ర చికిత్సలు అందించడం జరుగుతుందని కొన్ని రకాల సౌకర్యాలు పరికరాలు లేని కారణంగా ఇక్కడ కానీ కేసులను ఇతర ప్రాంతాలకు పంపించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అదిలాబాద్ పట్టణానికి చెందిన రామోజీ వార్ సంతోష్ గత సంవత్సరం నుండి నడవడం కూర్చోవడం లేని స్థితిలో ఉన్నాడని ఆయనకు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకురావడంతో సిటీ స్కాన్ తీయించి వ్యాధిని నిర్ధారించుకొని శాస్త్ర చికిత్స చేయడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా తలమడుగు మండలం పాలసీకే గ్రామానికి చెందిన నైతం లక్ష్మీబాయి ఆమెకు తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల రిమ్స్ ఆస్పత్రికి తీసుకురావడం జరిగిందని ఆమెకు అత్యవసర సర్జరీ చేసి చికిత్సలు అందించడం ద్వారా ఆమె ఇప్పుడు మాట్లాడగలుగుతుందని తెలిపారు సర్జరీకి ముందు ఆమె మాట్లాడుకోలేదని సర్జరీ తర్వాత మాట్లాడుతుందని తెలిపారు. ఈ రెండు శాస్త్ర చికిత్సలు చేయడం నికి జీన్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ తో పాటు న్యూరో సర్జరీ కి సంబంధించిన వైద్యులు నర్సులు సిబ్బంది తదితరులు అందరి సహాయ సహకారాలు వల్ల శాస్త్ర చికిత్సలు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ అశోక్, ఆర్ ఎం ఓ లు డాక్టర్ చంపరావు, డాక్టర్ సాయి, డాక్టర్ దేవిదాస్ సామల, డాక్టర్ పద్మవల్లి, నర్సింగ్ సూపరిండెంట్ రమాదేవి, జెస్సికా, అశ్విన్ కుమార్, సిమ్మికుమారి తదితరులు పాల్గొన్నారు.