ఆరోగ్య పాఠశాలను పకడ్బందీగా నిర్వహించండి - జిల్లా కలెక్టర్
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్,(ఆరోగ్య జ్యోతి): ఆరోగ్య పాఠశాల కార్యక్రమం లో భాగంగా బుధవారం వైద్యాధికారి కార్యాలయం లో ఏర్పాటు చేసిన గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా.బుధవారం జిల్లా కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా phc మెడికల్ ఆఫీసర్లు, Meos, RBSK అధికారులు, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, రిసోర్స్పర్సన్స్, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల లో శ్రీకారం చుట్టిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, నవంబర్ 14 న ప్రారంభించి నాలుగు వారాల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమం లో దీనిద్వారా విద్యార్థుల్లో మంచి మార్పులుచోటుచేసుకున్నాయని, ఈ సందర్భంగా ఇంకా నాలుగు వారాల పాటు దీనిని పొడగించి , మార్పులు చేర్పులు చేసి మరికొన్ని కొత్త ఆరు సూత్రాలను రూపొందించి విద్యార్థుల్లో ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి రూపొందించడం జరిగిందని తెలిపారు .ఈ సందర్భంగా ఆరోగ్య పాఠశాల కార్యక్రమం లో మొదటగా వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, ఒత్తిడి నివారణ, మాదక ద్రవ్యాలు, సీజనల్ వ్యాధుల పై విద్యార్థుల్లో మంచి అవగాహన కలిగి మంచి మార్పులు జరిగాయని, ఈ క్రమం లో విద్యార్ధుల ఆరోగ్యం పై దృష్టి సారించి, ప్రతీ వారం ఒక్కొక్క సబ్జెక్టు వారిగా కళ్లు వాటి సంరక్షణ,మంచి నిద్రతో కళ్ళకు విశ్రాంతి, నిర్ధిష్ట పరిస్థితుల్లో జాగ్రత్తలు, పిల్లల్లో సాధారణ కంటి సమస్యలు ఈ అంశాల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.అలాగే ఆరోగ్య పాఠశాల కార్యక్రమం లో భాగంగా ప్రతీ రోజూ పాఠశాలలో 6 వ తరగతి నుండి 9 వ తరగతి విద్యార్ధులకు కమ్యునికేషన్ నైపుణ్యాలు, పిల్లల విశ్వాసం, ఇంటర్నెట్ భద్రత, ప్రాముఖ్యత, ఇంటర్నెట్ వ్యసనం, అధిగమించే వ్యూహాలు, రీల్ లైఫ్, రియల్ లైఫ్, తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, ప్రతీ ఒక్క విద్యార్థి ని స్టూడెంట్ చాంపియన్ గా తయారు చేయాలని, వారి లో ఉన్న టాలెంట్ ను వెలికి తీయాలని పేర్కొన్నారు.అలాగే ప్రతి పాఠశాలల్లో యోగ చివరి పిరియడ్ లో నేర్పించడం జరుగుతుందని, విద్యార్ధులతో పాటు PET లు కూడా పాల్గొనాలని, విద్యార్ధులు సరిగా నేర్చుకుంటున్నారా లేదా పర్యవేక్షించాలని ఆన్నారు.
10వ తరగతి విద్యార్థుల కొరకు రూపొందించిన అభ్యాస దీపికలు సద్వినియోగ చేసుకునేలా అధ్యాపకులు చూడాలని , విద్యార్ధులు మంచి అలవాట్లు మెరుగు పరుచుకొని, ఆదర్శంగా నిలిచేందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణతి, అడిషనల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్, జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్, జిల్లా ఎయిడ్స్ మరియు లెప్రసీ నివారణ అధికారి డాక్టర్ గజనన్, జిల్లా అక్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత తదితరులు పాల్గొన్నారు.