Sports & Games

Breaking News

ట్రాన్స్ జెండర్ క్లినిక్ మరియు 108 వాహనాలను ప్రారంభించిన మంత్రి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

-కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో పేదలందరికీ అందుబాటులో వైద్య సేవలు 
- పి హెచ్ సి లు పెంచిన ఘనత కాంగ్రెస్దే 
- వైద్య కళాశాలలో పోస్టుల భర్తీ వైద్య పోస్టుల భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- మంత్రి సీతక్క 

ములుగు,(ఆరోగ్య జ్యోతి): జిల్లా ఆస్పత్రిలో 108 వాహనాలను మంత్రివర్యులు గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు  దానసరి  సీతక్క ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాకు  నూతనంగా 5 ..108 వాహనా లు మంజూరైనవేని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈరోజు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జగదీశ్వర్ తో కలిసి ప్రారంభించారు .అనంతరం ట్రాంజెండర్స్ కోసం జిల్లా ఆస్పత్రిలో వారి వైద్య సేవలు అందించడం నూతనంగా ఒక గదిని వారికి ట్రీట్మెంట్ ఓపిసే వలు అందించుటకు నూతనంగా ఒక గదిని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ట్యూటర్ల పోస్టులను భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనిని ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80 పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేసిందని అంతేకాకుండా సబ్ సెంటర్ లు కూడా కొత్తవి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వైద్య పోస్ట్లు ఫార్మాసిస్టు పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు స్టాఫ్ నర్స్ పోస్టులను రెగ్యులర్గా భర్తీ చేశామని తెలిపారువ్యాధులు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వారిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలను చేపడుతుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.ములుగు వెనుకబడిన జిల్లా నలమూలం నుండి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వస్తున్నారని తెలిపారు వారందరికీ మంచి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు.వైద్యులు ముఖ పాత్ర పోషించాలని ఇటు వాలే తెలంగాణ గవర్నమెంట్ ప్రారంభించిన 108 వాహనాలను సక్రమంగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అనంతరం ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ ట్రాంజెండర్ యొక్క సమస్యలను చెప్పుకోవడంలో ఆరోగ్య విషయంలో కొంత తడబాటుగా ఉన్నప్పటికీ వారికి ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేయడం మంచి శుభ సూచకమన్నారు.వారికి ఏమైనా ఇతరత్రా కారణాలు ఉంటే నేరుగా వచ్చి వైద్యులను సంప్రదించాలని జిల్లా ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజీలు అన్నివేళలా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వైద్యులు సిబ్బంది ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందు ఉంటారని. కరోనా సమయంలో కూడా ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలోనే వైద్య సేవలు అందించుటలో ముందున్నామని 
 నూతనంగా ఏర్పర్చిన ట్రాన్స్ జెండర్ క్లినిక్ ను  క్లినిక్ ను ట్రాన్స్ జెండర్స్ వారి యొక్క ఆరోగ్య సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు వైద్యులను సంప్ర దించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  కలెక్టర్ దివాకర టి ఎస్ , ఐ టి డి ఏ  పి ఓ. చిత్రా మిశ్రా , అలాగే ములుగు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ లాల్ . సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ . ఆర్తో ప్రొఫెసర్ డాక్టర్. జిల్లా వైద్య ప్రకాష్ , గైనకాలజీ హెచ్ ఓ డి డాక్టర్ నిరంజన్ మేడంగారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు , డి సి హెచ్ ఎస్ డాక్టర్ జగదీశ్వర్ , జిల్లా ఆస్పత్రి నర్సింగ్ సూపర్డెంట్ ,హెడ్ నర్సులు పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.