పెండింగ్ బిల్లులు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కి ఆశా కార్యకర్తల వినతి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్ (ఆరోగ్య జ్యోతి): అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఎలక్షన్ బిల్స్, ఎగ్జామ్ బిల్లులు, లెప్రసీ సర్వే బిల్లులు తోపాటు తదితర బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని కలెక్టర్ కి తెలిపారు.
కంటి వెలుగు ఇన్క్వాస్ లెప్రసి పల్స్ పోలియో తో పాటు తదితర బిల్లులు ఇంతవరకు అందలేదు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజార్షి షా మాట్లాడుతూ వీలైనతో తొందరలో అన్ని బిల్లులు వచ్చే విధంగా చూస్తానని చెప్పారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాత్రి మాట్లాడుతూ కొన్ని బిల్లులు ఈరోజు పడుతున్నాయని ఆన్లైన్లో చూసుకోవాలని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో అన్ని బిల్లులు పడతాయని ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే తమ తమ ఖాతాలు జమ చేస్తామని పేర్కొన్నారు. బిల్లులు కొన్ని పెండింగ్లో ఉన్న మాట వాస్తవంగాన్ని అన్ని బిల్లు గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత అకౌంట్ లో వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సురేష్, సుభాష్ ,ప్రమీల, జ్యోతి, అనిత ,ఆర్ అనిత, విశాల, జయ, నర్మదా ,లక్ష్మి మరియమ్మ గంగామణి, సునీత , జయ ,సుజాత, అనిత, సూర్య ,పార్వతి,కమల, సుమలత ,గంగమ్మ, పద్మ, గంగ భాగిత్త ,రుక్మిణి సుమిత్ర ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.