ఈనెల 14న బోత్ నియోజకవర్గం నికి సీతక్క
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
- రాష్ట్రమంత్రి సీతక్క పర్యటన విజయవంతం చేయండి
- బోతు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్
బోత్: ఈనెల 14న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పర్యటన ఉందని ఈ పర్యటనను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని బోత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బోత్ నియోజకవర్గంలోని ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం తోపాటు నేరడిగొండ మండలంలోని లకంపూర్ ఆశ్రమ పాఠశాల సందర్శన బోత్ ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కుంటాల సోమన్న హరితహారాన్ని మంత్రి ప్రారంభిస్తారు అని ఆయన పేర్కొన్నారు. అనంతరం బోత్ మండల కేంద్రంలో నూతన రిజిస్టర్ భవనాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారని ఆడే గజేంద్ర తెలిపారు. 400 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. బోట్ నియోజకవర్గం లో మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.