Sports & Games

Breaking News

భరత్ కుమార్ కి ఉద్యోగంతో పాటు 50 లక్షల ఎక్స్ గ్రేసియా చెల్లించాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

నిజామాబాద్: భరత్ కుమార్ కు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని జిల్లాలో అడిషనల్ కలెక్టర్ కి, డి ఎం అండ్ హెచ్ ఓ కి వినతి పత్రం ఇచ్చిన ఎన్ హెచ్ ఎం నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు ఏఐటీయూసీ  ఆధ్వర్యంలోసమస్యలు పరిష్కరించాలి భరత్ కు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్లు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. వీ. భరత్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం నుండి 50 లక్షల రూపాయలు గ్రేషియా ఇప్పించగలరు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించగలరు, పనిచేస్తున్న ఉద్యోగులందరికీ గత 7 నెల పి ఆర్  సి ఏరియర్స్ ఇప్పించగలరు, గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పి.ఓ.ఎల్. బకాయిలు వెంటనే మంజూరు చేయగలరు, ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మరియు రెగ్యులర్ ఉద్యోగుల నియామకాల్లో ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న వారి విద్య అర్హత ఆధారంగా వెయిటేజ్ మార్కులు ఇప్పించగలరని కోరుతున్నాము..ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ మేనేజర్ షాదుల్లా,  మురళి, గౌసుద్దీన్, సోమశేఖర్, మరియు తదితరులు పాల్గొన్నారు...