వడ్డాదిలో కార్తిక దీపోత్సవ కార్యక్రమం
.తాంసి మండలంలోని వడ్డాది గ్రామంలో కార్తిక దీపోత్సవ కార్యక్రమం కీర్తన దామోదర లీల ప్రణావానంద ప్రభు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వడ్డాది గ్రామంలోని భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్తీకదీపం లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో నిర్వహించారు. కార్తీకదీపం తో పాటు కీర్తన దామోదర్ లీల ప్రణావానంద ప్రభువు ఆధ్వర్యంలో ప్రవచనాలు కూడా నిర్వహించారు. అనంతరం మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.