Sports & Games

Breaking News

ఆరోగ్య జ్యోతి ఎడిటర్ ని సన్మానించిన బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

అదిలాబాద్: నేషనల్ మీడియా కాన్ఫిడెరేషన్ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె నరేష్ కుమార్ ని బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ  ఆధ్వర్యంలో శనివారం నాడు సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అజిత్, బ్రహ్మ సతీష్, శ్రీకాంత్, ఆసిఫ్ లు మాట్లాడుతూ నేషనల్ మీడియా కాన్ఫిడేషన్ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కే నరేష్ కుమార్ ఏకాగ్రేయంగా ఎన్నిక కావడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర స్థాయి లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఉన్నత పదవులు పొందాలని కోరారు. కే నరేష్ కుమార్ వార్తల పరంగానే కాకుండా సామాజిక సేవలో కూడా ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలందిస్తారని వారు పేర్కొన్నారు. వారి సేవలను గుర్తించి పదవి ఇవ్వడం ఎంతో సంతోషకరమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రెస్ పరంగానే కాకుండా ఇతర రంగాల్లో ఎవరికైనా అవసరం అయితే సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఆ పనిని ముందుకు ఇలా తీసుకువెళ్లాలో అందుకు సలహాలు ఇచ్చే వారిని వారు పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం సేవలు చేసి ఎడంలో ముందుండేవారు అందుకు ఆయనకు భగవంతుడు అన్ని విధాల ఆదుకోవాలని కోరుతున్నారు.