ఎడిటర్ కె నరేష్ ను సన్మానించిన వికాస్ యోజన
అదిలాబాద్: నేషనల్ మీడియా కాన్ఫిడెరేషన్ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె నరేష్ కుమార్ ని వికాస్ యోజన సంస్థ ఆధ్వర్యంలో శనివారం నాడు సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ హేమలత, ప్రధాన కార్యదర్శి ప్రసన్న లు మాట్లాడుతూ నేషనల్ మీడియా కాన్ఫిడేషన్ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కే నరేష్ కుమార్ ఏకాగ్రేయంగా ఎన్నిక కావడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర స్థాయి లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఉన్నత పదవులు పొందాలని కోరారు. కే నరేష్ కుమార్ వార్తల పరంగానే కాకుండా సామాజిక సేవలో కూడా ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలందిస్తారని వారు పేర్కొన్నారు. వారి సేవలను గుర్తించి పదవి ఇవ్వడం ఎంతో సంతోషకరమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.