ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
వృధాశ్రమంలో పండ్లను పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్న కాంగ్రెస్ శ్రేణులు
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి , మావల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మావల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు హాజరై కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సీఎం కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం కేఆర్కె కాలనీలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లను పంపిణీచేసి సేవాభావాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు తడిసెన వెంకట్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ మావల మండల్ అధ్యక్షులు కుంబోజి రాములు, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ కుదురుపాక సురేష్, మావల మండల్ NSUI అధ్యక్షులు గౌతమ్, సీనియర్ నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, బబ్లు, బాలకృష్ణ, అడెల్లు , కుర్ర నరేష్, రంజిత్ రెడ్డి, నాని, గాలిపెల్లి నాగన్న, నవీన్, అనిల్, లస్మన్న, దొగ్గలి హరీష్, రఘవంశీ, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.