మైలవరం సిఐ చంద్రశేఖర్ రావును సన్మానించిన ఉమెన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ నేషనల్ సభ్యులు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
మైలవరం: మైలవరం సిఐ డి.చంద్రశేఖర్ రావును సన్మానించిన ఉమెన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ నేషనల్ చైర్ పర్సన్ డాక్టర్ జ్ఞాన సుందరి మేడం జీసస్ ఫైర్ మినిస్ట్రీ మోజెస్ , అయ్యగారు స్టేట్ వైస్ చైర్మన్ బత్తుల గీతా, స్టేట్ సెక్రటరీ కాసుల పద్మా, వెంకాయమ్మ అందరూ కలసి గౌరవంగా శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉమెన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ నేషనల్ చైర్పర్సన్ డాక్టర్ జ్ఞాన సుందరి మాట్లాడుతూ రోజురోజుకు ఆడవాళ్ళ మీద దాడులు పెరుగుతున్నాయని వాటిని అరికట్టెందుకు కృషి చేయాలని కోరారు .ఆడవారికి న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు ఫ్యామిలీ గొడవల్లో కుటుంబాలు విడిపోకుండా ఫామిలీ కౌన్సిలింగ్ ఇచ్చి కలిపేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సిఐని ఆమె కోరారు. మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళలకు న్యాయం చేయడంలో పోలీసు వ్యవస్థ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మహిళలకు చట్టాలపై అవని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలకు ఆత్మ రక్షణ కోసం అనేకచోట్ల శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తనను ఉమెన్ ట్రేడ్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో సన్మానించడం ఎంతో సంతోషకరంగా ఉందని సీఐ పేర్కొన్నారు.