Sports & Games

Breaking News

మహబూబ్నగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కృష్ణ

.మహబూబ్నగర్ (ఆరోగ్య జ్యోతి): మహబూబ్నగర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ కృష్ణ సోమవారం రోజు బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించక ముందు జిల్లా కలెక్టర్ ను డాక్టర్ కృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాధ్యతలను స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిప్యూటీషన్లో రద్దు చేశారు దీంతో అదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా ఉన్న, డాక్టర్ కృష్ణ మహబూబ్నగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డిప్యూటేషన్ పై వచ్చారు. ప్రభుత్వం తిరిగి పంపించడంతో అదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పనిచేసిన డాక్టర్ కృష్ణ మహబూబ్నగర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిక డిప్యూటేషన్ పై వచ్చి బాధ్యతలను స్వీకరించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కృష్ణకు ఉద్యోగస్తులు వైద్యులు మెడికల్ పారామెడికల్ సిబ్బందితో పటు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన వివిధ సంఘాల నాయకులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు