Sports & Games

Breaking News

హైకోర్టు జడ్జి కుచాడి శ్రీదేవి కుటుంబ సభ్యులను పరామర్శించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి

.హైకోర్టు జడ్జి కుచాడి శ్రీదేవి కుటుంబ సభ్యులను పరామర్శించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి

 నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచడి శ్రీహరి రావు  మామయ్య, హైకోర్టు జడ్జి కుచాడి శ్రీదేవి తండ్రి జువ్వడి సూర్య రావు  ఇటీవల అనారోగ్యంతో మృతి మృతిచెందడంతో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణక్క తో కలిసి తెలంగాణ  కిసాన్  కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి వారిని పరామర్శించడం జరిగింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అంతకముందు సూర్య రావు చిత్రపటానికి నివాళులర్పించి అయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.