Sports & Games

Breaking News

విద్యార్థులకు వినియోగదారుల చట్టాలపై అవగాహన అవసరం

.*విద్యార్థులకు వినియోగదారుల చట్టాలపై అవగాహన సదస్సు
అదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక నలంద జూనియర్,డిగ్రీ  కాలేజ్ లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వినియోగదారుల హక్కుల సంస్థ కన్జ్యూమర్ రైట్స్ అర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు నవీన్ శర్మ, రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు, జిల్లా అధ్యక్షులు దొమ్మటి కిరణ్ కుమార్ ల ఆధ్వర్యంలో 2019 చట్టం పై  అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కన్జ్యూమర్ ఫోరం డిస్ట్రిక్ట్ జడ్జి జాబెజ్ సాముల, జిల్లా అదనపు కలెక్టర్ శ్యామల దేవి పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ ఎండి వాజిద్, డిస్టిక్ విజిలెన్స్ డైరీ ఆఫీసర్ మధుసూదన్ లు విద్యార్థులకు వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కన్జ్యూమర్  రైట్స్ ఆర్గనైజేషన్ బృంద  సభ్యులు డిస్టిక్ జనరల్ సెక్రెటరీ ఇర్ఫాన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమెన్స్ ప్రెసిడెంట్ టి హేమావతి, డిస్టిక్ సెక్రటరీ ఎస్. కే.చాంద్, సెక్రటరీ సురేందర్, ఆర్గనైజేషన్ సెక్రటరీ పి వెంకటేష్, స్పోర్ట్స్ పర్సన్ గోలి శివ, మీడియా ఇన్ఛార్జ్ విశాల్ గేడం దీపక్ రాకేష్ సుఖేష్, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఏ. రమా, చిట్టమ్మ ప్రసన్న నీరజ తదితరులు పాల్గొన్నారు.