క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి
Editor ke Naresh Kumar 98480 2545
- జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్
అదిలాబాద్: క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సిబ్బంది ముందు ఉండాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. బుధవారం రోజు జిల్లా క్షయ నివారణ అధికారి కార్యాలయంలో సిబ్బందికి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ క్షయ వ్యాధి మనిషి శరీరంలో ఊపిరితిత్తులపై ప్రభావితం చేస్తుందని తెలిపారు ఇది ఇతర అవయవాలు కూడా ప్రభావితం చేస్తుందని తెలిపారు. క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించినప్పుడే మనం వ్యాధిని అదుపు చేయవచ్చని తెలిపారు ముఖ్యంగా సర్వేలు వెళ్లినప్పుడు క్షయ వ్యాధి లక్షణాలు కనిపించడం వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేదా రిమ్స్ కు పరీక్షల నిమిత్తం పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత, డాక్టర్ సాయి ప్రియ తదితరులు పాల్గొన్నారు.