Sports & Games

Breaking News

భారతదేశపు యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

-  యోగా తోనే సంపూర్ణ ఆరోగ్యం ప్రతీ పాఠశాలలో విద్యార్ధులకు యోగా నేర్పించాలి :
-  జిల్లా పాలనాధికారి రాజర్షి షా 

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): భారతదేశపు యోగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆసుపత్రిలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన గావించారు.ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో యోగాను భాగం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని ఆన్నారు. పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజు యోగ అభ్యసించాలని ఆయన పేర్కొన్నారు.ఆయుష్ సేవలు ప్రతీ పాఠశాలలకు ఎంతో అవసరమని, అందుకు పాఠశాల, కళాశాల లో యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ఆన్నారు.  యోగాతో మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుందని, విద్యార్ధులు, యువత  సద్వినియోగపరచుకొని యోగా సాధన చేయాలన్నారు. నిత్యం యోగా సాధనతో అనేక రకాలైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని, రోగ నిరోధక శక్తి పెంపొందుతుందని తెలిపారు. యోగ ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని తెలిపారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా గర్భిణీ మహిళలకు యోగ ఆసనాలు చేయడం వల్ల సాధారణ ప్రసూతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ పేరుకున్నారు. ప్రతి గ్రామంలో యోగ చేయటం అలవాటు పంచుకోవాలని తెలిపారు. హాయ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యోగా ఆసనాలను కలెక్టర్ జగించారు.ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ , జిల్లా వైద్యాధికారి నరేందర్ , డాక్టర్ చందు, జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్టపల్లి వార్ డిస్టిక్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ప్రీతల్ రాథోడ్, డాక్టర్ వాణి, డాక్టర్ చంద్రశేఖర్ ,డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ పి శ్రీనాథ్, నర్సింగ్ సూపర్డెంట్ రమాదేవి, 
 సంజీవ్,నారాయణ ,సిద్ధార్థ, నవీన్, మంత్, కవిత జయ బాబు తదితరులు పాల్గొన్నారు.