Sports & Games

Breaking News

మత్తు పదార్థాలు మారకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

.విద్యార్థులు మత్తు పదార్థాలు,మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా పోగాకు నియంత్రణ విభాగం క్లినికల్  సైకాలజిస్ట్ శ్రీకాంత్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున ని ర్వహించిన కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వ్యసనం వలన భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు. పొగాకు ఉత్పత్తుల వలన క్యాన్సర్ లాంటి వ్యాధుల వస్తాయని అన్నారు. చదువు కేవలం ఉన్నత పదవులు పొందడానికే కాదు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు పరీక్షలు మాత్రమే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించవని వారి నడవడిక ఆత్మవిశ్వాసం అనుకున్నది సాధించేలా చేస్తుందని సూచించారు తాము ఏం చేస్తున్నాము అనే విషయంపై ఖచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలని కోరారు స్వామి వివేకానంద చెప్పినట్టుగా మన ఆత్మవిశ్వాసమే మన బలం మన భయమే మన బలహీనత అని తెలిపారు విద్యార్థి దశ నుంచి వేసే ప్రతి అడుగు తాము ఏ వైపు వెళ్లాలనేది నిర్ణయిస్తుందని తెలిపారు చెడు అలవాట్లు వ్యక్తుల్ని బలహీనులుగా మారుస్తాయని వాటికి దూరంగా ఉండాలని సూచించారు ఉన్నత స్థానంలో ఉన్న వారిని కూడా దురలవాట్లు దిగజారుస్తాయని తెలిపారు అసాంఘిక శక్తుల నుంచి దేశాన్ని సమాజాన్ని కాపాడాలంటే విద్యార్థి దశ నుంచి మంచి నడవడిక అలవాటు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్,  పొగాకు నియంత్రణ విభాగం సోషల్ వర్కర్ చిరంజీవి, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.