రిమ్స్ లో పనిచేస్తున్న కృష్ణ కాంటాక్ట్ ను బ్లాక్ లో పెట్టండి? జిల్లా కలెక్టర్..
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
కృష్ణ కాంటాక్ట్ ఏజెన్సీ బ్లాక్ లో పెట్టండి?..
- వారికి ఇవ్వవలసిన బిల్లు కమిషన్ మొత్తం ఆపివేయండి
- ఉద్యోగులకు యధావిధిగా వేతనాలు చెల్లించండి
- రిమ్స్ డైరెక్టర్ కి కలెక్టర్ ఆదేశం
ఆదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్య జ్యోతి);: రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పనిచేస్తున్న కృష్ణ కాంట్రాక్ట్ ఏజెన్సీ ని బ్లాక్ లో పెట్టాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ కు తెలిపారు. ఆయుష్ యోగ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్కు కృష్ణ ఏజెన్సీ తరఫున వర్కర్లు అందరొచ్చి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు మేము పారిశుద్ధ పనులు ఇతర పనులు ఆసుపత్రిలో సక్రమంగా చేస్తున్నామని కాంటాక్ట్ కు సంబంధించిన అన్ని బిల్లులు చెల్లించాలని కలెక్టర్ కోరారు. దీన్ని విన్న తర్వాత జిల్లా కలెక్టర్ డైరెక్టర్ కృష్ణ కాంటాక్ట్ కు సంబంధించిన అన్ని కమిషన్ బిల్లులు ఆపివేయాలని కృష్ణా కాంట్రాక్ట్ ను బ్లాక్ లో పెట్టాలని జిల్లా కలెక్టర్ డైరెక్టర్కు తెలిపారు. దాదాపు 8 లక్షల రూపాయల వరకు బిల్లులను కలెక్టర్ ఆపి వేస్తున్నట్టు తెలిసింది. కాంట్రాక్టర్ కు సంబంధించిన కమిషనర్ బిల్లులను ఇవ్వాలని కాంట్రాక్టర్ తరపున వర్కర్లు వచ్చి కలెక్టర్ ను కోరారు కలెక్టర్ ఆగ్రహించారు. రిమ్స్ లో పని సక్రమంగా లేదని కృష్ణ కాంటాక్ట్ ఏజెన్సీలో పనిచేస్తున్న వారి వేతనాలు యధావిధిగా వేయాలని కానీ కృష్ణ జన్సి కి సంబంధించిన కమిషన్లను ఆపివేయాలని కలెక్టర్ డైరెక్టర్ పేర్కొన్నారు. వర్కర్స్ ఎంత బతిమిలాడినప్పటికీ కలెక్టర్ మాత్రం ఒప్పుకోలేదు. కృష్ణ ఏజెన్సీ ని బ్లాక్ లిస్టులో పెట్టి ఆయనకు సంబంధించిన కమిషన్ ను నిలిపివేయాలని డైరెక్టర్ కి కలెక్టర్ తెలిపారు.ఏం జరుగుతుందో ఏమో చూడాలి మరి?