హెచ్- 1 యూనియన్ ఆధ్వర్యంలో టీజీవో సంఘ నాయకులకు సన్మానం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): హెచ్ వన్ యూనియన్ ఆధ్వర్యంలో టీజీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ఎస్ వామన్ రావు సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడిన కె అనిల్ కుమార్ ని హెచ్ -1జిల్లా అధ్యక్షులు బండారి కృష్ణ ఆధ్వర్యంలో సన్మానించారు.గత 11 సంవత్సరాలుగా యూనియన్ నందు వివిధ హోదాలో సేవలు అందించినందుకు హెచ్ వన్ యూనియన్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. టీజీవో సంఘంలో రాబోయే రోజుల్లో అనేక హోదాల్లో అంచలంచలుగా ఎదగాలని సంఘం అధ్యక్షులు బండారి కృష్ణ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వైసీ శ్రీనివాస్ డాక్టర్ శ్రీధర్ మెట్టపల్లి డాక్టర్ గజానంద్ సంఘ సలహాదారులు ఎస్ బ్రహ్మానందరెడ్డి కార్యాలయ పర్యవేక్షకులు గుజరాతి గోపి హెచ్ వన్ యూనియన్ జిల్లా కార్యదర్శి అల్లాడి రఘురాం కార్యనిర్వాహక అధ్యక్షులు రమణాచారి ఉపాధ్యక్షులు రవీందర్ రాథోడ్ సంఘ నాయకుడు ఎస్ గంగాధర్ వెంకటరమణ సచిన్ వివేక్ వెంకట్ రమేష్ విజయ్ తదితరులు సన్మాన కార్యక్రమంలో ఉన్నారు.