సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని కలెక్టర్ కి వినతి పత్రం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
నిర్మల్, (ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ ఏం లను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కి మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారికి వినతిపత్రం ఇచ్చారు. ఈ వినతి పత్రం కార్యక్రమంలో శోభ ,జన, సరస్వతి, కౌసల్య, విమల ,లక్ష్మి, లతీప తో పాటు ఆరోగ్య కార్యకర్త కర్తలు కలిసి వినతిపాత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సెకండ్ ఏఎన్ఎంలుగా పని చేస్తున్నామని తెలిపారు. 20 సంవత్సరాలు గా వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తూ కేంద్ర రాష్ట్ర ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కీలకపాత్ర వహించామన్నారు. అలాంటి సెకండ్ anm లకు ఇప్పుడు పరీక్షలు పెడితే ఎలా రాస్తామని వారు ప్రభుత్వాన్ని పేర్కొన్నారు. రెగ్యులర్ పాసైన వారితో పరీక్షలు ఎలా రాయగలం.. అందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి సెకండ్ ఏఎన్ఎం లందరినీ రెగ్యులర్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో పాటు పనికి మించిన భారాన్ని మోస్తూ ప్రజలకు వైద్యసే వాళ్ళు అందించడంలో కీలకపాత్ర పోషించామని వారు పేర్కొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఇబ్బందులు పడుతూ వైద్య ఆరోగ్యశాఖలు విధులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ సెకండ్ ఏఎన్ఎం లను వెంటనే రెగ్యులర్ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.