సెకండ్ ఏఎన్ఎం లను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని ధర్నా
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
భద్రాద్రి కొత్తగూడెం, (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెకండ్ ఏ ఎన్ యు లను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని భద్రాద్రి కొత్తగూడెంలో నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘాల బాధ్యులు అరుణ, ప్రియాంకలు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి వైద్య ఆరోగ్యశాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా పనిచేస్తున్నామని తెలిపారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు మాకు రెగ్యులర్ చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారికి పరీక్షలు పెట్టి రెగ్యులర్ చేస్తాము అనటం సరైన పద్ధతి కాదని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా నేషనల్ హెల్త్ మిషన్ తో పాటు వివిధ పథకాలు పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు అందరిని రెగ్యులర్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఆరోగ్య కార్డులు హెల్త్ ఇన్సూరెన్స్ ఇతర అలవెన్స్ ఏమీ లేకుండా 20 సంవత్సరాలు ట్రైబల్ ఏరియాల్లో బస్సులు రోడ్లు సౌకర్యాలు లేకుండా తిరుగుతూ ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేసిన సెకండ్ ఏఎన్ఎం లను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని ఆమే డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రియాంక పార్వతి పద్మజ జ్యోతి కౌసల్య తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేషనల్ హెల్త్ మిషన్ సెకండ్ ఏఎన్ఎం తదితరులు పాల్గొన్నారు