Sports & Games

Breaking News

నేడు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ను కలవనున్న వైద్య ఆరోగ్యశాఖ జేఏసీ నాయకులు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు వైద్య ఆరోగ్యశాఖ సంఘాల ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. గత 20 సంవత్సరాల నుండి నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రాన్ని సమర్పించడం అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న డాక్టర్లకు ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేశారని అదే జీవో ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్తో వినతిపత్రం ఇవ్వనున్నారు. సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఫైల్ ఫోటో