సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, కమిషనర్ కి వినతి పత్రం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ , ప్రిన్సిపాల్ సెక్రటరీ మరియు కమిషనర్ కి వైద్య ఆరోగ్యశాఖ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ సంఘాల సభ్యులు మధురిమ, మమత, కవిత, అరుణ ,జ్యోతి ,సుగుణ, సత్య ,నాసిమా తో పాటు తదితరులు ఈ వినతిపత్రం ఇచ్చారు. ఈ వినతి పత్రంలో గత 20 సంవత్సరాల నుండి నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని వారు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమకు అన్యాయం జరిగిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న వైద్యులకు గత ప్రభుత్వం రెగ్యులర్ చేసిందని అదే జీవో ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పదిమంది చేసే పని ఒక్క సెకండ్ ఏఎన్ఎం చేస్తుందని పని భారాన్ని వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా పనిచేస్తున్నప్పటికీ ఎలాంటి అలవెన్సులు లేకుండా రిస్క్ అలవెన్సులు కూడా ప్రభుత్వం ఇవ్వటం లేదని డిస్క్ అలవెన్స్ లో చెల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.గతము ప్రభుత్వం ఏఎన్ఎంల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో ధర్నా చేయడం జరిగిందని ఈ ధర్నాలో భాగంగా ప్రభుత్వం గత ఏడాది సమ్మె చేసినప్పుడు త్రిసభ్యాస కమిటీ వేశారు ఆ కమిటీల్లో మమ్మల్ని చర్చలకు పిలవాలనేసి చెప్పడం జరిగింది అప్పటివరకు ఎగ్జాంనే వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. సెకండ్ ఏఎన్ఎంలు రకరకాల జబ్బులతో బాధపడుతున్నారని వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.